ఆదిలాబాద్ ఎయిర్ పోర్టుకు గ్రీన్ సిగ్నల్... 1580 ఎకరాలు ఇవ్వడానికి తెలంగాణ సర్కార్ రెడీ...

ఆదిలాబాద్ ఎయిర్ పోర్టుకు గ్రీన్ సిగ్నల్... 1580 ఎకరాలు ఇవ్వడానికి తెలంగాణ సర్కార్ రెడీ...

ఆదిలాబాద్ ఎయిర్ పోర్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. ఎయిర్ పోర్టుకు 1580 ఎకరాలు ఇవ్వడానికి సిద్దమైన రాష్ట్ర సర్కార్ ప్రతిపాదన లేఖను రక్షణ శాఖ జాయింట్ సెక్రెటరీ మహంతికి అందించారు ఎమ్మెల్యే పాయల్ శంకర్. ఈమేరకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన లేఖ పట్ల సానుకూలత తెలిపింది కేంద్రం.

రక్షణ శాఖ చెందిన 400 ఎకరాలు, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే1580 ఎకరాలు కలిపి1980 ఎకరాల్లో  ఎయిర్ ఫోర్స్  స్టేషన్, ఎయిర్ పోర్టు నిర్మాణానికి సానుకూలంగా ఉన్నట్లు తెలిపింది  కేంద్రం

కేంద్రం నిర్ణయంపై  సంతోషం వ్యక్తం చేశారు ఎమ్మెల్యే పాయల్ శంకర్. ఎయిర్ పోర్ట్  నిర్మాణంపై సానుకూలంగా ఉన్న ప్రధాని మోడీ, సీఎం  రేవంత్ కు క్రుతజ్నతలు తెలిపారు ఎమ్మెల్యే పాయల్ శంకర్.