రైళ్లు, విమానాలు ఎప్పుడూ స్టార్ట్ అవుతాయో తెలియదు

రైళ్లు, విమానాలు ఎప్పుడూ స్టార్ట్ అవుతాయో తెలియదు

న్యూఢిల్లీ : రైళ్లు, విమాన సర్వీసులు నడపటంపై ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదని కేంద్రమంత్రి ప్రకాశ్ జవదేకర్ స్పష్టం చేశారు. దీనిపై అనవసర ఊహాగానాలు ప్రచారం చేయవద్దని కోరారు. రవాణా సేవలను త్వరలోనే ప్రారంభించే అవకాశం ఉందా అని మీడియా అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు. ” ఏదో ఒకరోజు రైలు, విమాన సర్వీసులు తిరిగి ప్రారంభించాలి. కానీ అది ఎప్పుడూ అనేది ఎవరం చెప్పలేము. ప్రస్తుత పరిస్థితుల్లో దీనిపై చర్చే అనవసరం. ప్రభుత్వం రోజు పరిస్థితి అంచనా వేస్తూ అవసరానికి అనుగుణంగా నిర్ణయం తీసుకుంటుంది” అని ప్రకాశ్ జవదేకర్ చెప్పారు. కొన్ని విమాన సంస్థలు మే 4 నుంచి బుకింగ్స్ ప్రారంభిస్తన్నట్లు ఇప్పటికే ప్రకటించాయి. ఈ విషయంలో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ఏవియేషన్ మినిస్టర్ హార్దీప్ సింగ్ పూరి స్పష్టంగా ప్రకటన చేశారని జవదేకర్ గుర్తు చేశారు. కేంద్రం లాక్ డౌన్ పై తీసుకునే నిర్ణయం అనుగుణంగా రైలు, విమాన సర్వీసులు ప్రారంభించటంపై ఆలోచిస్తామని ఆయన చెప్పారు.