బీహెచ్ సిరీస్ వెహికల్‌కు రీ రిజిస్ట్రేషన్ అవసరం లేదు

బీహెచ్ సిరీస్ వెహికల్‌కు రీ రిజిస్ట్రేషన్ అవసరం లేదు

న్యూఢిల్లీ: ఏదైనా కొత్త రాష్ట్రానికి షిఫ్ట్ అయ్యేటప్పుడు వెహికల్స్‌‌‌‌ను రీ–రీజిస్ట్రేషన్ చేసే భాద నుంచి తప్పించేందుకు కేంద్రం బీహెచ్ సిరీస్‌‌‌‌ రిజిస్ట్రేషన్‌‌‌‌ను ప్రాసెస్‌‌‌‌ను తీసుకొచ్చింది. బీహెచ్‌‌‌‌ సిరీస్‌‌‌‌ ఉన్న వెహికల్స్‌‌‌‌ వేరే రాష్ట్రానికి షిఫ్ట్ అయినా వెహికల్స్‌‌‌‌ను రీ–రిజిస్ట్రేషన్‌‌‌‌ చేయాల్సిన అవసరం లేదు. రోడ్డు, ట్రాన్స్‌‌‌‌పోర్టేషన్‌‌‌‌ మినిస్ట్రీ తెచ్చిన ఈ  స్కీమ్‌‌‌‌కు డిఫెన్స్ పర్సనల్స్‌‌‌‌, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ప్రభుత్వ కంపెనీల ఉద్యోగులు, నాలుగు లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాలు లేదా యూటీలలో బిజినెస్‌‌‌‌ చేస్తున్న ప్రైవేట్ కంపెనీల ఉద్యోగులు  అర్హులు. ఇది వాలంటరీ స్కీమ్‌‌‌‌. బీహెచ్‌‌‌‌ సిరీస్‌‌‌‌ వెహికల్ రిజిస్ట్రేషన్ నెంబర్‌‌‌‌‌‌‌‌ వైవై బీహెచ్‌‌‌‌ #### ఎక్స్‌‌‌‌ఎక్స్ గా ఉంటుంది. ఇందులో వైవై అంటే ఫస్ట్‌‌‌‌ రిజిస్ట్రేషన్ జరిగిన ఏడాదిని, #### నెంబర్‌‌‌‌‌‌‌‌ను, ఎక్స్‌‌‌‌ఎక్స్‌‌‌‌ రెండు ఆల్ఫాబెట్ నెంబర్స్‌‌‌‌ను తెలుపుతాయి. రూ. 10 లక్షల కంటే తక్కువ ఖర్చు ఉన్న  నాన్ ట్రాన్స్‌‌‌‌పోర్ట్‌‌‌‌ బీహెచ్‌‌‌‌ సిరీస్ వెహికల్‌‌‌‌పై 8 శాతం వెహికల్‌‌‌‌ ట్యాక్స్‌‌‌‌ను వేస్తారు. రూ. 10–12 లక్షల అయితే 10 శాతం, రూ. 20 లక్షల కంటే ఎక్కువుంటే 20 శాతం వెహికల్‌‌‌‌ ట్యాక్స్ 
విధిస్తారు.