భీమా కొరేగావ్ కేసులో కొత్త ట్విస్ట్

భీమా కొరేగావ్ కేసులో  కొత్త ట్విస్ట్

ముంబై: ప్రధాని నరేంద్ర మోడీ హత్యకు కుట్ర కేసుకు సంబంధించి కొత్త ట్విస్టులు తెరపైకి వస్తున్నాయి. ఆ కేసులో లూప్​హోల్స్​ ఉన్నాయని మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్​పవర్​ పుణె పోలీసులతో పేర్కొన్నట్టు వార్తలు వస్తున్నాయి. 2017 ఎల్గర్​ పరిషత్​– భీమా కొరేగావ్​ అల్లర్ల కేసుకు సంబంధించి 2018 ఆగస్టులో వరవరరావు, సుధీర్​ ధవళ, రోనా విల్సన్​, సురేంద్ర గాడ్లింగ్​, మహేశ్​ రౌత్​, షోమా సేన్​, అరుణ్​ ఫెరీరా, వెర్నన్​ గొన్సాల్వెజ్​, సుధా భరద్వాజ్​లను పుణె పోలీసులు అరెస్ట్​ చేసిన సంగతి తెలిసిందే. విచారణలో భాగంగా ప్రధాని మోడీని హత్య చేసేందుకు ‘అర్బన్​ నక్సల్స్’కుట్ర పన్నారంటూ పోలీసులు పేర్కొన్నారు. వాళ్లపై అన్​లాఫుల్​ యాక్టివిటీస్​ ప్రివెన్షన్​ యాక్ట్​ (యూఏపీఏ) కింద కేసు పెట్టి 5 వేల పేజీల చార్జిషీటును దాఖలు చేశారు. అయితే, వాళ్లను కుట్రపూరితంగా కేసుల్లో ఇరికించారని, కేసును సిట్​తో దర్యాప్తు చేయించాలని ఎన్సీపీ చీఫ్​ శరద్​పవార్​ జనవరి 10న రాష్ట్ర ప్రభుత్వానికి రెండు లేఖలు రాశారు. ఈ నేపథ్యంలోనే పుణే పోలీసులతో అజిత్​ పవార్​ రివ్యూ మీటింగ్​ పెట్టారు. చార్జిషీటులో లుకలుకలున్నట్టు పోలీసులకు ఆయన చెప్పినట్టు తెలుస్తోంది. ఈ రివ్యూలో మహారాష్ట్ర డీజీపీ సుబోధ జైస్వాల్​, స్టేట్​ ఇంటెలిజెన్స్​ కమిషనర్​ రష్మి శుక్లా, సీనియర్​ ఐపీఎస్​లు పాల్గొన్నారు.