పారిశ్రామిక దిగ్గజం పల్లోంజీ మిస్త్రీ కన్నుమూత

పారిశ్రామిక దిగ్గజం పల్లోంజీ మిస్త్రీ కన్నుమూత

పారిశ్రామిక దిగ్గజం పల్లోంజీ మిస్త్రీ ఇకలేరు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ముంబైలోని తన నివాసంలో కన్నుమూశారు. పల్లోంజీ మిస్త్రీ నేతృత్వంలో షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ దేశంలోనే అతిపెద్ద సంస్థగా ఎదిగింది. పల్లోంజీ భారత్లోనే పుట్టి పెరిగినప్పటికీ..2003లో మన పౌరసత్వం వదులుకుని ఐరీస్ జాతీయుడిగా మారిపోయారు. ఆయన నికర ఆస్తుల విలువ 28.90 బిలియన్ డాలర్లు. ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడైన ఐరిస్ పౌరుడిగా  ఆయన రికార్డుకెక్కారు.

1865లో షాపూర్జీ పల్లోంజీ సంస్థ ఏర్పాటు అయ్యింది. ఇంజనీరింగ్ నిర్మాణం, ఇన్ ఫ్రాస్ట్రక్చర్, రియల్ ఎస్టేట్, వాటర్, ఎనర్జీ, ఫైనాన్షియల్ సర్వీసెస్ లో వ్యాపారం సాగిస్తోంది. పారిశ్రామిక రంగంలో పల్లోంజీ సేవలకు కేంద్రప్రభుత్వం పద్మవిభూషణ్ అవార్డుతో సత్కరించింది. ఇక రాష్ట్రంలో కొత్తగా నిర్మిస్తున్న సచివాలయ భవనం, హైదరాబాద్ పోలీస్ కమాండ్ కంట్రోల్ భవనాలను ఈ సంస్థే నిర్మిస్తోంది. ఇక టాటా గ్రూప్ లో అత్యధిక వ్యక్తిగత షేర్ హోల్డర్ గా పల్లోంజి మిస్త్రీ ఉన్నారు.ఆయనకు 18శాతం వాటా ఉంది. ఇక పల్లోంజీ మృతిపట్ల ప్రధాని మోడీ సంతాపం ప్రకటించారు. వాణిజ్య,పరిశ్రమ రంగానికి పల్లోంజి అసాధారణ సహకారాన్ని అందించినట్లు చెప్పారు.