టెక్నికల్ ప్రాబ్లమ్.. చంద్రయాన్-2 వాయిదా

టెక్నికల్ ప్రాబ్లమ్.. చంద్రయాన్-2 వాయిదా

చంద్రయాన్ -2 వాయిదా అర్ధరాత్రి అనంతరం సాంతికేక సమస్యను గుర్తించిన శాస్త్రవేత్తలు  ఇస్రో ప్రతిష్టా త్మకంగా చేపట్టిన ‘చంద్రయాన్–2’ ప్రయోగం సాంకేతిక కారణాలతో వాయిదా పడింది. షెడ్యూల్ ప్రకారం జీఎస్ఎల్వీ మార్క్–3 రాకెట్ సోమవారం తెల్లవారుజామున 2.51 గంటలకు ఆర్బిటర్, ల్యాం డర్, రోవర్లను తీసుకుని నింగిలోకి దూసుకెళ్లాలి. అర్ధరాత్రి వరకు కౌంట్ డౌన్ ప్రక్రియ సాఫీగానే సాగింది. కానీ సుమారు 2 గంటల సమయంలో రాకెట్ లో ఏదో  సమస్యను గుర్తించి.. కౌంట్ డౌన్ ను కొంతసేపు నిలిపివేశారు. సమస్యను సరిచేయడానికి ప్రయత్నించారు. చివరికి 2.40 గంటల సమయంలో ప్రయోగాన్ని వాయిదా వేస్తున్నామని, తిరిగి ఎప్పుడు నిర్వహించేదీ త్వరలో వెల్లడిస్తామని ఇస్రో ప్రకటించింది.