వావ్: ఈ దీపం 24 గంటలూ వెలుగుతుందట

వావ్: ఈ దీపం 24 గంటలూ వెలుగుతుందట

కొండగావ్: దీపావళి పండుగ రాబోతోంది. అయితే కరోనా వ్యాప్తితోపాటు గాలి కాలుష్యం దృష్ట్యా పండుగకు టపాసులు కాల్చడంపై పలు రాష్ట్రాలు బ్యాన్ వేశాయి. ప్రస్తుత పరిస్థితుల్లో పండుగను నిరాడంబరంగా ఇళ్లల్లోనే జరుపుకోవాలని నిపుణులు, మేధావులు సూచిస్తున్నారు. టపాసులు కాల్చకపోతే ఏం.. దీపాలను వెలిగిస్తూ దీపాల పండుగగా వేడుకలు జరుపుకోవాలని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో చత్తీస్‌‌గఢ్‌‌లో ఓ  వ్యక్తి చేసిన దీపాల డిజైన్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ దీపం 24 గంటలు వెలుగుతుందంటున్నాడు దీన్ని తయారు చేసిన అశోక్ చక్రధర్. ఈ దీపంలో ఒక్కసారి నూనెను నింపితే మళ్లీ వేయాల్సిన అవసరం లేదు. దీపం ఆటో‌‌మెటిక్‌‌గా ఆయిల్‌‌ను రీ-ఫిల్ చేసుకునేలా దీన్ని చక్రధర్ రూపొందించాడు. ‘ఆన్‌‌లైన్‌‌లో పలు టెక్నిక్‌‌లను చూసి ఈ దీపాన్ని తయారు చేయడం నేర్చుకున్నా. ఇలాంటి మరిన్ని దీపాలు రూపొందించాలని నాకు చాలా ఆర్డర్‌‌లు వచ్చాయి. ఇప్పుడు అదే పనిలో ఉన్నా’ అంటూ వెరైటీ దీపాన్ని తయారు చేసిన చక్రధర్ అన్నాడు.