పేదలకు ఫ్రీగా రేషన్ ఇవ్వండి

పేదలకు ఫ్రీగా రేషన్ ఇవ్వండి
  • కేంద్రానికి చిదంబరం డిమాండ్

న్యూఢిల్లీ: పేదలకు ఉచితంగా రేషన్ ఇవ్వాలని కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరం కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. చేతిలో డబ్బులు లేక పేదలు, వలసకూలీలు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. రేషన్, పూట తిండి కోసం బారులు తీరాల్సి వస్తోందని చెప్పారు. దయలేని కేంద్ర ప్రభుత్వం పేదల కోసం ఏమీ చేయట్లేదని మండిపడ్డారు. పేదల ఆత్మగౌరవాన్ని కాపాడేందుకు వెంటనే వారి అకౌంట్లలో నగదు జమ చేయాలన్నారు. ఎఫ్ సీఐ దగ్గర ఉన్న 7.7 కోట్ల టన్నుల ఆహార ధాన్యాల్లో కొంత భాగం పేదలకు ఉచితంగా పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. ఈ ప్రశ్నలకు జవాబు చెప్పడంలో ప్రధాని మోడీ, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫెయిలయ్యారని ఆరోపించారు. లాక్ డౌన్ కారణంగా చిక్కుకుపోయిన వేలాది మంది వలస కూలీలు, పేదలకు వెంటనే క్యాష్ ట్రాన్స్ ఫర్ చేయాలని, ఉచితంగా రేషన్ ఇవ్వాలని ఆదివారం ట్వీట్ చేశారు.