పేరంటింగ్ : మీ పిల్లల మొబైల్, టీవీ స్క్రీన్ టైం ఎంత ఉండాలి.. అదే పనిగా చూస్తుంటే వచ్చే నష్టాలు ఘోరంగా ఉంటాయా..!

పేరంటింగ్ : మీ పిల్లల మొబైల్, టీవీ స్క్రీన్ టైం ఎంత ఉండాలి.. అదే పనిగా చూస్తుంటే వచ్చే నష్టాలు ఘోరంగా ఉంటాయా..!

ఈ కాలం పిల్లలు చాలా మారిపోయారు. టెక్నాలజీలో వారికున్న పరిజ్ఞానం పెద్దవారికి కూడా ఉండడం లేదు. పెద్దల కంటే ఈజీగా స్మార్ట్ ఫోన్, ల్యాస్​టాప్, ట్యాబ్ ఆపరేట్ చేసేస్తున్నారు. ఆపరేట్ చేయడం వరకు ఓకే? కానీ.. వాటికి అడిక్ట్ అయిపోవడం ఆలోచించాల్సిన విషయం. అసలు పిల్లలు ఎంతసేపు స్క్రీన్ చూడొచ్చు. వారి స్క్రీన్ టైం ఎంత?  మొదలగు విషయాలను ఈ స్టోరీలో తెలుసుకుందాం. . 

అమ్ములు అన్నం తినాలంటేఆ మొబైల్ వీడియోలు ప్లే చేయాలి. లేదంటే... ల్యాప్​ టాప్​ లో  ఏదైనా సినిమానో...  వీడియోనో చూపించాలి. అది కూడా కుదరకపోతే... టీవీ పెట్టాలి.. మునుపటిలా చందమామను చూస్తూ... అన్నం తినే రోజులు కావివి. అంతా.. స్క్రీన్ మీదే. ఇది ఒక్కరింట్లో జరిగే తంతు కాదు. దాదాపు ఈ కాలంలో ప్రతీ ఇంటా కనిపించే సీనే. చిన్నవయసులోనే టీవీ, ల్యాప్​ టాప్, మొబైల్ చూడడానికి అలవాటు పడితే.. స్క్రీన్ లైట్ ఎఫెక్ట్ వారి చూపు మీద ప్రభావం చూపుతుంది. 

ఫలితంగా చిన్నవయసులోనే దృష్టి సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది.. దాదాపు 70 నుంచి 80 శాతం మంది తల్లులు పిల్లలకు అన్నం తినిపించే సమయంలో వారి చేతికి మొబైల్ ఇస్తున్నారు. అది చూస్తూ.. పిల్లలు అన్నం తింటున్నారు సరే.. వారి ఆరోగ్యం, మెదడు మీద పడే ప్రభావం సంగతే పట్టించుకోవడం లేదు. కదలకుండా ఒకేచోట కూర్చొని స్క్రీన్ మీద ఎక్కువ సమయం ఉండడం వల్ల పిల్లల ఆరోగ్యం మీద తీవ్ర ప్రభావం చూపుతుంది. 

ALSO READ | ఏడు అంటే 7 సెకన్లలో మీ గుండె ఎలా పని చేస్తుందో చెప్పేస్తుంది.. AI యాప్ తయారు చేసిన 14 ఏళ్ల బాలుడు

వాషింగ్టన్ కి చెందిన ఆర్కిటిక్ యూనివర్సిటీ చేసిన పరిశోధనలో స్క్రీన్ టైం ఎక్కువగా ఉన్న పిల్లలు క్రియేటివ్​ గా ఆలోచించే శక్తిని కోల్పోతారని తేలింది.. దీనికి తోడు.. వారి ఎముకల ఆరోగ్యం మీద కూడా ప్రభావం చూపి ఎదుగుదలకు అడ్డంకిగా మారుతుంది. టీవీ, మొబైల్, ల్యాప్ టాప్, ట్యాబ్ స్క్రీన్ నుంచి వచ్చే వెలుతురు కంటి శుక్లాలకు నష్టం చేకూరుస్తుంది. దీనికి తోడు పిల్లలు ఫిజికల్ గేమ్స్ పట్ల ఆసక్తి కోల్పోతారు. ఫలితంగా వారిలో ఉండాల్సిన చురుకుదనం దెబ్బతింటుంది.

 సోమరిగా వ్యవహరిస్తుంటారు.ఒబేసిటీకి కారణమయ్యే వాటిలో స్క్రీన్ టైమ్ కూడా ఒకటి. అందుకే.. టీవీ, ఐప్యాడ్, స్మార్ట్​ఫోన్ లు పిల్లలకు ఇవ్వకపోవడమే మంచిది. ఒకవేళ ఇవ్వాల్సి వస్తే.. టైం లిమిట్ పెట్టాలి. రోజులో గంట, గంటన్నర కంటే ఎక్కువ సేవు ఇవ్వకూడదు. ఎక్కువసేపు కదలకుండా ఒకే చోట కూర్చొని దృష్టంతా స్క్రీన్ మీదే పెట్టడం వల్ల ఒత్తిడి పెరుగుతుంది. 

దూరంగా ఉన్న వస్తువులను, చిన్నగా ఉన్న వస్తువులను. చూసే శక్తిని కోల్పోతారు. చిన్నపిల్లలైనా, పెద్దవాళ్లైనా రోజులో గంట నుంచి గంటన్నర వరకు స్క్రీన్ టైమ్ ఉండేలా ప్లాన్ చేసుకోవాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా నివేదిక ద్వారా తెలుస్తుంది.  సో డియర్​ పేరెంట్స్​  అబ్బా.. మా చిన్నారి ఎంత చక్కగా సెల్​ఫోన్​ ఆపరేట్​ చేస్తున్నాడని సంబరపడి.. వారి స్క్రీన్​ టైం ఇచ్చామంటే వారి ఆరోగ్యాన్ని  ఆ పేరెంట్సే చెడగొట్టిన వారవుతారని గ్రహించాలి.. . . 

-–వెలుగు,లైఫ్​–