చాక్లెట్‌‌ ర్యాంప్‌‌వాక్‌‌

చాక్లెట్‌‌ ర్యాంప్‌‌వాక్‌‌

ఫ్రాన్స్ రాజధాని పారిస్‌‌లో జరిగిన ఫ్యాషన్‌‌ షో ర్యాంప్‌‌ స్వీట్‌‌గా మారిపోయింది. మోడల్స్‌‌ నడిచొస్తుంటే చాక్లెట్‌‌ వాసనలు నోరూరించాయి. ఆరడుగుల చాక్లెట్స్‌‌.. స్వీట్‌‌ లవర్స్‌‌ కోసం నడిచొచ్చినట్లే అనిపించింది. ర్యాంప్‌‌వాక్‌‌లో స్వీట్‌‌ ఏంటి? చాక్లెట్‌‌ నడిచి రావడం ఏంటి అనుకుంటున్నారా? అవును.. మోడల్స్‌‌ చాక్లెట్ల డ్రెస్‌‌లు వేసుకుని ర్యాంప్‌‌పై సందడి చేశారు. చాక్లెట్‌‌ డ్రెస్‌‌లు అంటే ఆ మోడల్‌‌ డ్రెస్సో.. లేక డ్రెస్సులకు చాక్లెట్లు చుట్టుకుని వస్తున్నారో అనుకుంటే పొరపాటు. ఏకంగా డ్రెస్‌‌నే చాక్లెట్‌‌తో తయారు చేశారు. ఏటా అక్టోబర్‌‌‌‌లో ‘సెలూన్‌‌ ఆఫ్‌‌ చాక్లెట్’ పేరుతో పారిస్‌‌లో చాక్లెట్‌‌ ఫెస్టివల్‌‌ చేస్తారు. ఇంటర్నేషనల్‌‌ చాక్లెట్‌‌ ఫ్యాక్టరీలను ఒక దగ్గరికి తీసుకొచ్చేందుకు ఈ ఫెస్టివల్‌‌ అన్నమాట. 1994లో దీన్ని ప్రారంభించారు. ఫ్రెంచ్‌‌ మినిస్ట్రీ ఆఫ్‌‌ ఫారెన్‌‌ అఫైర్స్‌‌ ఆధ్వర్యంలో దీన్ని నిర్వహిస్తారు. పారిస్‌‌, న్యూయార్క్‌‌, టోక్యో, మాస్కోతో పాటు బీజింగ్‌‌, షాంఘైల్లో కూడా ఈ ఫెస్టివల్‌‌ ఏర్పాటు చేశారు. రకరకాల చాక్లెట్‌‌ ఫ్లేవర్స్‌‌తో చేసిన వంటకాలు, చాక్లెట్లతో ఫుడ్‌‌స్టాల్స్‌‌ ఏర్పాటు చేస్తారు. చాక్లెట్‌‌ ప్రిపరేషన్స్‌‌, రకరకాల వంటలకు సంబంధించి వర్క్‌‌షాప్స్‌‌ ఉంటాయి ఇక్కడ. ప్రపంచం లోని దాదాపు 700 మంది టాప్‌‌ చెఫ్స్‌‌ ఈ చాక్లెట్‌‌ ఫెయిర్‌‌‌‌లో పాల్గొంటారు. దాంతో పాటుగా టాప్‌‌ చెఫ్స్‌‌ రాసిన రెసిపీ బుక్స్‌‌తో పెద్ద పెద్ద బుక్‌‌స్టాల్స్‌‌ పెడతారు. దీంతో చాక్లెట్‌‌ లవర్స్‌‌ ప్రతి ఏడు ఈ ఫెయిర్‌‌‌‌ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఈ ఏడాది అక్టోబర్‌‌‌‌ 28న స్టార్ట్‌‌ అయిన ఈ ఫెస్టివల్‌‌ నవంబర్‌‌‌‌ 1 వరకు ఉంటుంది. “ ఏటా చాక్లెట్‌‌ డ్రెస్‌‌లతో మోడల్స్‌‌ చేసే ఫ్యాషన్‌‌ షో హైలైట్‌‌. దాన్ని చూడటం కోసం ఎక్కడెక్కడి నుంచో ఫ్యాషన్‌‌ అండ్ చాక్లెట్‌‌ లవర్స్‌‌ ఈవెంట్‌‌కి వస్తారు” అని చెప్పారు నిర్వాహకులు.