Manmadhudu Actress Anshu : యంగ్ హీరోతో మన్మధుడు బ్యూటీ అన్షు రీ ఎంట్రీ..డైరెక్టర్ ఎవరంటే?

Manmadhudu Actress Anshu : యంగ్ హీరోతో మన్మధుడు బ్యూటీ అన్షు రీ ఎంట్రీ..డైరెక్టర్ ఎవరంటే?

టాలీవుడ్ లో మన్మధుడు(Manmadudu) అంటే ఠక్కున గుర్తొచ్చే హీరో నాగార్జున(Nagarjuna). అది ఎంత ఫేమసో, ఆయన హీరోగా చేసిన మన్మధుడు సినిమా కూడా అంతే ఫేమస్. లవ్ అండ్ ఎమోషనల్ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ సినిమా 2002 విడుదలై భారీ విజయాన్ని సాధించింది. త్రివిక్ర‌మ్(Trivikram) కథ, మాట‌లు కే.విజయభాస్కర్(K Vijayabhaskar) దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో సోనాలి బింద్రే(Sonali Bindre), అన్షు (Anshu) హీరోయిన్‌లుగా న‌టించారు. 

అయితే ఈ సినిమా టాలీవుడ్ లోకి బ్లాక్ బస్టర్ ఎంట్రీ ఇచ్చింది అన్షు స‌గ్గ‌ర్. సినిమాలో మహి పాత్రలో కనిపించిన ఆమె తన నటనతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. పాత్ర చిన్నదే అయినా చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేసింది ఈ బ్యూటీ. ఇక మన్మధుడు మూవీ బ్లాక్ బస్టర్ అవడంతో ఈ తర్వాత మంచి అవకాశాలు అందుకున్నారు అన్షు. ప్రభాస్ తో రాఘవేంద్ర మూవీలో ఛాన్స్ దక్కించుకున్నారు. కానీ, ఆ సినిమాతో పరాజయాన్ని చవిచూసింది. ఆ తరువాత నుండి సినిమాలకు దూరంగా ఉంటూ వచ్చిన ఆమె..చాలా కావాలంగా ఇంగ్లాడ్ లో సెటిల్ అయ్యారు. 

అప్పట్లో ఈ బ్యూటీ అందానికి యూత్‌ పిచ్చెక్కిపోయారు. తాజాగా అన్షు రీ ఎంట్రీకి రంగం సిద్ధమైంది. సందీప్ కిషన్ హీరోగా డైరెక్టర్ త్రినాధరావు నక్కిన దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. హాస్య మూవీస్ బ్యానర్ మీద రాజేష్ దండ నిర్మిస్తున్న ఈ సినిమాలో అన్షు ఒక కీలక పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం.

ఈ మేరకు డైరెక్టర్ త్రినాథరావు అన్షుకి కథ కూడా చెప్పినట్లుగా తెలుస్తోంది. కథ , తన పాత్రలోని ఇంపార్టెన్స్ నచ్చడంతో ఆమె ఈ సినిమాకి గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చినట్లు టాక్. ఇక 20 ఏళ్ళ తర్వాత అన్షు తెలుగులో రీఎంట్రీ ఇవ్వడం కన్ఫమ్ అనేలా బుజ్ వినిపిస్తోంది. త్వరలో ఆమె ఎంట్రీపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.