RTC ని ప్రైవేట్ పరం చేయొద్దనే విషయాన్ని గవర్నర్ కు చెప్పాం

RTC ని ప్రైవేట్ పరం చేయొద్దనే విషయాన్ని గవర్నర్ కు చెప్పాం

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆర్థిక వైఫల్యాలపై కాంగ్రెస్‌ నేతలు శుక్రవారం గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌తో భేటీ అయ్యారు.  అటు దేశంలోనూ, రాష్ట్రంలోనూ ఆర్ధిక పరిస్థితులపై  వినతిపత్రం అందజేశారు. అనంతరం సీఎల్పీ నాయకుడు భట్టి విక్రమార్క రాజ్ భవన్ వద్ద  మీడియాతో మాట్లాడుతూ..  నరేంద్రమోదీ విధానం వల్ల దేశం మొత్తం నష్ట పోతుందని, GDP 3% కు పడిపోయిందని అన్నారు. రాష్ట్రంలో కూడా ఆర్థిక పరిస్థితి దివాలా తీసిందన్నారు. లక్షల కోట్లు అప్పులు చేసి, తప్పుడు లెక్కలు చెబుతున్నారన్నారు.

RTC ని ప్రవైట్ పరం చేయొద్దనే విషయాన్ని గవర్నర్ కు వివరించామని చెప్పారు భట్టి.  రాష్ట్రంలో  దిగజారిపోతున్న ఆర్థిక వ్యవస్థ, పోతున్న ఉద్యోగాల గురించి,రైతుల గురించి, ప్రాజెక్ట్ లలో జరుగుతున్న అవినీతి ని కాంగ్రెస్ పార్టీ ప్రశ్నించినందుకు,  అక్రమంగా కాంగ్రెస్ కార్యకర్తలను,  నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారన్నారు.

RTC JAC ఇచ్చిన పిలుపు మేరకు ఛలో ట్యాంక్ బండ్ ముట్టడికి కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతు పలుకుతుందని, తాము కూడా ఛలో ట్యాంక్ బండ్ లో పాల్గొంటామని భట్టి విక్రమార్క ఈ సందర్భంగా చెప్పారు.

clp-leader-bhatti-vikramarka-meets-governer