హైదరాబాద్ మణికొండలో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఆదివారం ( మార్చి 29 ) జరిగిన ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి.. మణికొండలోని అల్కాపురి టౌన్షిప్ రోడ్ నంబర్ 25లో ఉన్న ఓ గేటెడ్ కమ్యూనిటీలోని అపార్టుమెంట్లో థర్డ్ ఫ్లోర్ లో మంటలు చెలరేగాయి. భారీగా మంటలు చెలరేగడంతో దట్టమైన పొగ కమ్ముకుంది.
సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. రెండు ఫైర్ ఇంజన్ల సాయంతో మంటలు అదుపులోకి తెచ్చారు ఫైర్ సిబ్బంది. సకాలంలో ఫైర్ సిబ్బంది స్పందించడంతో ఆస్థి నష్టం, ప్రాణనష్టం తప్పింది.
ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటనలో ప్రాణనష్టమేమీ జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. షార్ట్ సర్క్యూట్ వల్ల ప్రమాదం జరిగి ఉండచ్చని ప్రాధమికంగా అంచనా వేస్తన్నట్లు తెలిపారు పోలీసులు.
