ఆది యోగి విగ్రహాన్ని ఆవిష్కరించిన కర్ణాటక సీఎం

ఆది యోగి విగ్రహాన్ని ఆవిష్కరించిన కర్ణాటక సీఎం

కర్ణాటకలోని చిక్‭బళ్లాపూర్‭లో 112 అడుగుల ఆదియోగి విగ్రహాన్ని సీఎం బసవరాజ్ బొమ్మై ఆవిష్కరించారు. అవలగుర్కి గ్రామ సమీపంలో ఇషా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఆదివారం సాయంత్రం ఈషా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు సద్గురు జగ్గీ వాసుదేవ్ సమక్షంలో ఆదియోగి విగ్రహావిష్కరణ జరిగింది. ఈ విగ్రహాన్ని కర్ణాటకలో ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందని బసవరాజ్ బొమ్మై చెప్పారు. ఆదియోగిని కొన్ని సెకన్ల పాటు చూస్తే చాలా విషయాలు అర్థమవుతాయని అన్నారు. దేశ సంస్కృతిని నిలబెట్టే కార్యకలాపాలకు తమ ప్రభుత్వం ఎప్పుడూ మద్దతు ఇస్తుందని చెప్పారు. తాను కూడా ఎన్నోసార్లు కోయంబత్తూరుకు వెళ్లానని స్పష్టం చేశారు. ఈ విగ్రహావిష్కరణతో చిక్‌బళ్లాపూర్‌ ప్రాంతం మరింత అభివృద్ధి చెందుతుందన్నారు. 

చిక్‌బళ్లాపూర్‌ను అంతర్జాతీయ గమ్యస్థానంగా తీర్చిదిద్దుతామని సద్గురు జగ్గీ వాసుదేవ్ ప్రకటించారు. ప్రపంచంలోని నలుమూలల నుండి ప్రజలు ఇక్కడికి వస్తున్నారని చెప్పారు. ఇక.. విగ్రహావిష్కరణ సందర్భంగా ఏర్పాటు చేసిన లేజర్‌ షో భక్తులను ఆకట్టుకుంది. అలాగే సద్గురు జగ్గీ వాసుదేవ్ కుమార్తె రాధే భరతనాట్యం, కేరళకు చెందిన కళాకారులు నృత్యం ప్రదర్శన తో అలరించాయి. ఇవాళ్టి నుంచి సాయంత్రం వేళల్లో ఆది యోగిని దర్శించుకునేందుకు సందర్శకులకు అనుమతించనున్నారు.