సీఎం ఆదేశం.. సప్తగిరి ఛానల్ ద్వారా 10వ తరగతి విద్యార్ధుల‌కు పాఠాలు

సీఎం ఆదేశం.. సప్తగిరి ఛానల్ ద్వారా 10వ తరగతి విద్యార్ధుల‌కు పాఠాలు

లాక్ డౌన్ పొడిగించిన నేపథ్యంలో ప్రస్తుతం 10వ తరగతి పరీక్షలు నిర్వహించలేకపోతున్నామ‌ని, పరీక్షలు జరిగేంత వరకు విద్యార్దులకు సప్తగిరి ఛానల్ ద్వారా ఆన్ లైన్లో పాఠాలు బోధించడం జరుగుతుందని ఆ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. సీఎం వైయస్ జగన్ ఆదేశాలు మేరకు టీవీల ద్వారా విద్యార్ధుల‌కు క్లాసులు చెప్ప‌డం జ‌రుగుతుంద‌ని ఆయ‌న వెల్ల‌డించారు.

సప్తగరి ఛానల్ ద్వారా రోజుకు రెండు గంటలపాటు ఉదయం 10 గంటనుంచి 11 గంటలవరకు , సాయంత్రం 4 గంటల నుంచి 5గంటల వరకు పాఠ్యాంశాల బోధన ప్రసారం అవుతాయ‌ని ఆయ‌న అన్నారు. విద్యార్దులు ఇంటివద్దనే ఉండి పరీక్షలకు ఏ విధంగా ప్రిపేర్ కావాలి, ఆ సబ్జెక్టులను ఎలా అర్ధం చేసుకోవాలనే అంశం మీద‌ విద్యామృతం అనే కార్యక్రమాన్ని రూపొందించడం జరిగిందని చెప్పారు. విద్యామృతం కార్యక్రమం ద్యారా పాఠాల‌ను బోధించేందుకు విద్యాశాఖ,సాంఘికసంక్షేమం, గిరిజనసంక్షేమం,వెనకబడిన తరగతుల సంక్షేమం,మైనారిటీల సంక్షేమం శాఖల పరిధిలో స్కూళ్లలో పనిచేస్తున్న అధ్యాపకులను ఎంపిక చేయడం జరిగింద‌ని చెప్పారు. దీనికి ఇప్పటికే ట్రయిల్ రన్ నిర్వహించామ‌ని అన్నారు

రాష్ర్టంలో సుమారు ఐదులక్షలమంది విద్యార్దులు ఆన్ లైనా ద్వారా వీక్షించే అవ‌కాశ‌ముంద‌ని, క్లాస్ వర్క్ మిస్అయినా కూడా అవే క్లాసులను యూట్యూబ్ సప్తగిరి ఛానల్ లో కూడా అందుబాటులో ఉంచుతామని మంత్రి సురేష్ తెలిపారు. యూట్యూబ్ ఛానల్ ను కూడా 1.50 లక్షలమంది విద్యార్దులు చూశారు విద్యార్థులు సమయాన్ని వృధా చేయకుండా…ఈ క్లాసులను వినియోగించుకోవాల‌ని విజ్ఞప్తి చేశారు. టీవీ ఎదుట కూర్చుని క్లాసెస్ ను వినాలని,వారిని సరైన విధంగా విద్యార్దుల‌ తల్లిదండ్రులు కూడా మోటివేట్ చేయాలని ఆయ‌న కోరారు.

క్లాసెస్ నిర్వహణకు పకడ్బందీగా రూపకల్పన చేయడం జరిగిందని, ఇందుకోసం ఉన్నతాధికారులతో స్టీరింగ్ కమిటిని ఏర్పాటు చేశామ‌ని మంత్రి చెప్పారు. ఆన్ లైన్ లో పాఠాలు చెప్పడానికి ఉత్సాహం ఉన్న ఉపాధ్యాయులు కూడా ముందుకు రావచ్చన్నారు. వన్ ఆర్ టూ మినిట్ వీడియోలను తయారుచేసి పంపిస్తే వారిని సైతం ఆన్ లైన్ క్లాస్ వర్క్ లో ఉపయోగించుకునే విధంగా ప్లాన్ చేస్తామ‌ని తెలిపారు. లాక్ డౌన్ పీరియడ్ లో ఆన్ లైన్ క్లాస్ వర్క్ ఉన్నతవిద్యకు సంబంధించి ఆల్ యూనివర్సిటి వైస్ ఛాన్సలర్స్ కు కూడా ఆదేశాలిచ్చామ‌న్నారు మంత్రి సురేష్.

cm ys jagan orders that online classes for 10th class students says education minister suresh