సముద్రాల ప్లాస్టిక్ వేస్ట్‌‌‌‌‌‌‌‌తో కోకా-కోలా బాటిళ్లు

సముద్రాల ప్లాస్టిక్ వేస్ట్‌‌‌‌‌‌‌‌తో  కోకా-కోలా బాటిళ్లు

కోకా–కోలా, ఫాంటా, స్ప్రైట్‌‌ కూల్​డ్రింకులు ఇక సరికొత్త ‘సీ గ్రీన్ బాటిల్స్’లో కనిపించనున్నాయి. సముద్రం నుంచి సేకరించిన ప్లాస్టిక్ చెత్తతోనే వీటిని తయారు చేస్తున్నట్లు ఆ కంపెనీ చెబుతోంది. తొలి దశలో స్పెయిన్, పోర్చుగల్‌‌లోని 84 బీచ్ ల నుంచి సేకరించిన ప్లాస్టిక్ వేస్ట్‌‌తో 300 బాటిళ్లను తయారు చేసినట్లు వెల్లడించింది. ఇకపై మరిన్ని బాటిళ్లనూ తయారు చేస్తామని, వచ్చే ఏడాది నుంచి తమ గ్రీన్ బాటిళ్లు అందుబాటులోకి వస్తాయని అంటోంది. అడ్డమైన ప్లాస్టిక్ నంతా పోగేసి, మామూలుగా రీసైకిల్ చేస్తే.. వాటి ద్వారా కూల్ డ్రింకుల్లోకి విష పదార్థాలు కలిసే ప్రమాదం ఉంటుంది. అందుకే ఈ గ్రీన్ బాటిళ్ల తయారీ కోసం ‘ఎన్ హ్యాన్స్ డ్ రీసైక్లింగ్’ పద్ధతిని వాడారు. ఈ పద్ధతిలో తక్కువ రకం ప్లాస్టిక్‌‌లోని మలినాలన్నీ తొలగిపోతాయని చెబుతున్నారు.