బొద్దింక ఈజ్ బ్యాక్: అణు బాంబు వేసినా చావదు అంటూ రెచ్చిపోతున్న నెటిజన్లు

బొద్దింక ఈజ్ బ్యాక్: అణు బాంబు వేసినా చావదు అంటూ రెచ్చిపోతున్న నెటిజన్లు

కాక్రోచ్ ఈజ్ బ్యాక్.. బొద్దింక మళ్లీ వచ్చింది.. అణు బాంబు వేసినా చావనిది బొద్దింక అంటూ ఎక్స్ Xలో దుమ్ముదుమారం చేస్తున్నారు నెటిజన్లు. 

కాక్రోచ్ జనతా పార్టీని ఇండియాలో ఎక్స్ అకౌంట్ ను బ్లాక్ చేసిన కొన్ని గంటల్లోనే.. ఈ సారి స్విజ్జర్లాండ్ నుంచి పుట్టుకొచ్చింది ఈ బొద్దింక జనతా పార్టీ అకౌంట్..
కాక్రోచ్ జనతా పార్టీ ఇండియా ఎక్స్ అకౌంట్‎ను బ్లాక్ చేసే ముందు ఫాలోవర్స్ 2 లక్షల మంది మాత్రమే ఉన్నారు.. 

కాక్రోచ్ ఈజ్ బ్యాక్ అంటూ కొత్త అకౌంట్ క్రియేట్ చేసిన తర్వాత.. నెటిజన్లు దుమ్ము దుమ్ముగా వస్తున్నారు.
కాక్రోచ్ ఈజ్ బ్యాక్ అనే పేరుతో.. X అకౌంట్ క్రియేట్ చేసిన గంటలోనే.. 25 వేల మంది ఫాలోవర్స్ రావటం విశేషం.

సోషల్ మీడియాను షేక్ చేస్తోన్న డిజిటల్ పొలిటికల్ సెటైరికల్ కాక్రోచ్ జనతా పార్టీ ఎక్స్ (ట్విట్టర్)లోకి రీ ఎంట్రీ ఇచ్చింది. ఇండియాలో దాని ఒరిజినల్ అకౌంట్‎ను బ్లాక్ చేసిన కొన్ని గంటల్లోనే ‘కాక్రోచెస్ ఈస్ బ్యాక్’ పేరుతో కాక్రోచ్ జనతా పార్టీ కొత్త X అకౌంట్ క్రియేట్ చేసింది. ఎక్స్‎లోకి పునరాగమనం చేసిన వెంటనే ఈ బొద్దింకల పార్టీ రెండు పోస్టులతో విమర్శకులను ఎగతాళి చేసింది.

ఒక పోస్టులో “మమ్మల్ని వదిలించుకోగలమని అనుకున్నారా..? హా హా” అని పేర్కొనగా.. మరొక పోస్టులో ఇన్‌స్టాగ్రామ్‎లో బీజేపీ ఫాలోవర్ల సంఖ్యను కాక్రోచ్ జనతా పార్టీ బీట్ చేయడంతోనే మమ్మల్ని బ్లాక్ చేశారని అర్థం వచ్చేలా బీజేపీ ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్, కాక్రోచ్ జనతా పార్టీ ఒరిజినల్ ఫాలోవర్ల సంఖ్యను పోలుస్తూ స్క్రీన్‌షాట్‌లను షేర్ చేసింది. 

కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే కూడా కాక్రోచ్ ఈస్ బ్యాక్ ఎక్స్ అకౌంట్‎ను ధృవీకరించాడు. ఈ ఖాతాను ఫాలో కావాలని మద్దతుదారులకు సూచించాడు. దీంతో గంట గంటకు కాక్రోచ్ ఈజ్ బ్యాక్ పార్టీకి ఫాలోవర్ల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ప్రస్తుతం ఫాలోవర్ల సంఖ్య 30K రీచ్ అయ్యింది. ప్రస్తుత ఫ్లో చూస్తుంటే ఇన్ స్టా మాదిరిగానే ట్విట్టర్ లో కూడా ఈ పార్టీకి భారీగా మద్దతు లభించనుంది.