పిడుగు పడి కాలిపోయిన కొబ్బరి చెట్టు

పిడుగు పడి కాలిపోయిన కొబ్బరి చెట్టు

రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల భారీ వర్షాలు  పడుతున్నాయి.  కొన్ని చోట్ల రోడ్లన్నీ జలమయం అయ్యాయి.  హైదరాబాద్ లోని పలు చోట్ల భారీ వర్షం  పడింది.  తెల్ల వారుజాము నుంచే వర్షం కురిసింది.  జూబ్లీహిల్స్, బంజారాహీల్స్, అమీర్ పేటర్ ,యూసఫ్ గూడ, పంజాగుట్ట, ఖైరతాబాద్, కూకట్ పల్లి, నేరెడ్ పెట్, కుత్బుల్లాపూర్,  ముషిరాబాద్, వనస్థలిపురం, హయత్ నగర్, ఎల్బీ నగర్, దిల్ సుఖ్ నగర్,  ఉప్పల్, ఈసీఐఎల్, బోయిన్ పల్లి ,పాతబస్తీ , రాజేంద్ర నగర్, శేర్ లింగంపల్లి, గచ్చిబౌలి, ఏరియాల్లో ఉరుములు,మెరుపులతో కూడిన వర్షం పడింది. పలు చోట్ల రోడ్లపైకి నీరు చేరడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోంది. ట్రాఫిక్ జాం అయ్యింది. 

రంగారెడ్డి జిల్లా కేశంపేట మండలం నిర్ధవెల్లి గ్రామంలో ఇవాళ ఉదయం పిడుగు పాటుకు కొబ్బరి చెట్టు దగ్ధం అయ్యింది.  గ్రామానికి చెందిన దిద్దెల చెన్నయ్య ఇంటి ముందున్న  కొబ్బరి చెట్టు పైన పిడుగు పడింది. చెట్టుకు దగ్గర్లో  ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. పిడుగు పాటుకు కొబ్బరి చెట్టు  పూర్తిగా  కాలిపోయింది.

మరో రెండు రోజులు సిటీలో వానలు పడొచ్చని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. సోమవారం భారీ వర్షం కురిసే చాన్స్​ఉందని ఎల్లో అలెర్ట్(6.4 నుంచి 11.5 సెంటీమీటర్లు) జారీ చేశారు.