6G రానుంది..! : ఇంటర్నెట్ స్పీడ్ ఎంతో తెలిస్తే.. షాక్

6G రానుంది..! : ఇంటర్నెట్ స్పీడ్ ఎంతో తెలిస్తే.. షాక్

టెక్నాలజీ పెరుతున్నా కొద్దీ టైంకి విలువ కూడా పెరుగుతుంది. అసాధ్యాలన్నీ సుసాధ్యాలుగా మార్చి సైంటిస్టులు జనాలకు షాక్‌ల మీద షాక్‌లు ఇస్తున్నారు. నిన్నమొన్నటి వరకు 4జీ వస్తే చాలు అనుకున్నోళ్ల.. ఇప్పుడు 5జీ తెచ్చుకున్నాం.. అంతటితో ఆగకుంటా అలుపెరుగని పోరాటం చేస్తూ 6G వైపుకు అడుగులు వేస్తున్నాం.. DOCOMO, NEC, NTT కార్పొరేషన్లు మరియు ఫుజిట్సు వంటి జపనీస్ టెలికాం కంపెనీలు 6G ప్రోటోటైప్ పరికరాన్ని అభివృద్ధి చేయడంలో కీలక ఘట్టాన్ని చేరుకున్నాయి. ప్రపంచంలోనే ఫస్ట్ 6జీ ప్రోటోటైప్ జపాన్ కనిపెట్టింది. ఏప్రిల్ 11న దాన్ని టెస్టింగ్ కూడా చేసింది. అది విజయవంతం అయిందట.

ఈ 6జీ ఇంటర్నెట్ స్పీడ్ 5జీ కంటే 20రెట్టు ఎక్కువగా ఉంటుందట. ఇండియాలో 5జీ నెట్ వర్క్ వాడుటం ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేశారు. ఫారన్ కంట్రీస్ లో అది ఎప్పుడో జరిగింది. 6జీ 100GB పర్ సెకండ్ ఇంటర్నెట్ స్పీడ్ ఇవ్వగలదట. 5G టెక్నాలజీ గరిష్టంగా 10 Gbps స్పీడ్ తో ఇంటర్నెట్ వస్తోందని చెప్పుకుంటున్నప్పటికీ రియల్ టైంలో 200 నుండి 400 Mbps మధ్యనే ఉంది. ప్రస్తుతం వస్తున్న 6జీని 100 మీటర్లు రేడిస్ లో టెస్ట్ చేస్తే  300 GHz బ్యాండ్ అవుట్‌డోర్‌లో  కూడా 100GBps వేగంతో కనెక్టివిటీ ఉందని జపనీస్ సెంటీస్టులు చెబుతున్నారు.