అమెరికన్ దిగ్గజ కంపెనీ గూగుల్ భారతీయులకు క్రిస్మస్ అండ్ న్యూ ఇయర్ కింద గొప్ప అఫర్ తీసుకొచ్చింది. అదేంటంటే ఇండియాలో గూగుల్ పిక్సెల్ అప్‌గ్రేడ్ ప్రోగ్రామ్ ప్రారంభించింది. ఈ ప్రోగ్రామ్ కింద మీరు ప్రతి నెల కేవలం రూ. 3,333 EMIతో కొత్త పిక్సెల్ స్మార్ట్‌ఫోన్ కొనొచ్చు. ఈ ప్రోగ్రామ్ ఈరోజే ప్రారంభమైంది, ప్రతి ఏడాది ఫోన్ అప్‌గ్రేడ్ చేసుకోవాలనుకునే వారికి ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. గూగుల్ ఈ ప్రోగ్రామ్‌ను క్యాషిఫై, బజాజ్ ఫైనాన్స్ లిమిటెడ్, HDFC బ్యాంక్ సహకారంతో తీసుకువచ్చింది.
గూగుల్ పిక్సెల్ అప్‌గ్రేడ్ ప్రోగ్రామ్ పేరులాగే ఇదొక స్మార్ట్‌ఫోన్ అప్‌గ్రేడ్ మాత్రమే. గూగుల్ ఈ ప్రత్యేక కార్యక్రమం జూన్ 30 2026 వరకు భారతదేశంలోని సెలెక్ట్ చేసిన రిటైల్ స్టోర్‌లలో మాత్రమే ఉంటుంది. ఈ ప్రోగ్రాం ద్వారా లేటెస్ట్ టెక్నాలజీని ఉపయోగించాలనుకునే వారికీ ఇంకా ప్రతి ఏడాది కొత్త ఫోన్ అనుభవాన్ని ఆస్వాదించాలనుకునే వారికి ఒక గొప్ప అవకాశం.
గూగుల్ పిక్సెల్ అప్‌గ్రేడ్ ప్రోగ్రామ్ అంటే ఏమిటి?
ఈ ప్రోగ్రామ్ కింద సలెక్ట్ చేసిన పిక్సెల్ స్మార్ట్‌ఫోన్‌లను 24 నెలల నో-కాస్ట్ EMIతో కొనోచ్చు. అంతేకాదు మీరు తొమ్మిది నెలల EMI కట్టిన తర్వాత కూడా మీ పాత ఫోన్‌ను కొత్త పిక్సెల్ మోడల్‌తో ఎక్స్చేంఙ్ చేసుకోవచ్చు.
ఈ అప్‌గ్రేడ్ ప్రోగ్రామ్ ఎలా పొందవచ్చు:
ఈ ప్రోగ్రామ్ కింద మీరు కనీసం తొమ్మిది EMI కట్టి ఉంటే, మీరు మీ ప్రస్తుత పిక్సెల్ ఫోన్‌ను కొత్త మోడల్‌తో ఎక్స్చేంజి చేసుకోవచ్చు. అయితే, మీరు 15 EMIలు చెల్లించినట్లయితే ఈ ఆఫర్ వర్తించదని గుర్తుంచుకోండి.
Cashify మీ పాత ఫోన్ పై మిగిలిన EMI మొత్తాన్ని అంటే మీ పాత లోన్‌ను క్లోజ్ చేస్తుంది, ఇంకా ఎటువంటి అదనపు ఛార్జీలు లేకుండా కొత్త దానికి అప్‌గ్రేడ్ చేసుకోవచ్చు. దీని తర్వాత మీరు కొత్త ఫోన్ కోసం 24 నెలల నో-కాస్ట్ EMI ప్లాన్‌లో కొనొచ్చు.
Also Read :గోవాలో క్రిస్మస్ పార్టీలు, మీరు మిస్ కాకుడని ఈవెంట్స్, సెలెబ్రేషన్స్ లిస్ట్ ఇదిగో...
కొత్త పిక్సెల్ ఫోన్ కొనడం వల్ల కొన్ని గూగుల్ సర్వీసుల ఫ్రీ ట్రయల్స్ కూడా లభిస్తాయి. పిక్సెల్ 10 ప్రోతో ఒక ఏడాది గూగుల్ AI ప్రో, ఆరు నెలల ఫిట్‌బిట్ ప్రీమియం, మూడు నెలల యూట్యూబ్ ప్రీమియం లభిస్తాయి. పిక్సెల్ 10తో ఫిట్‌బిట్ & యూట్యూబ్ ప్రీమియం ట్రయల్స్‌తో పాటు ఆరు నెలల గూగుల్ వన్ ప్రీమియం (2TB) కూడా లభిస్తుంది.
ఈ అప్‌గ్రేడ్ ప్రోగ్రామ్‌లో పిక్సెల్ 10, పిక్సెల్ 10 ప్రో, పిక్సెల్ 10 ప్రో ఎక్స్‌ఎల్, పిక్సెల్ 10 ప్రో ఫోల్డ్ వంటి మోడళ్లు ఉన్నాయి. మీరు మీ పాత ఫోన్‌ను ఎక్స్చేంజి చేసినప్పుడు మీరు క్యాషిఫై నుండి రూ. 7వేల వరకు ఎక్స్ఛేంజ్ బోనస్‌ను కూడా ఉంటుంది.
