జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం మొగిలిపేట సమీపంలో ట్రాక్టర్ బోల్తా పడి నలుగురు మృతి చెందిన ఘటన విషాదం నింపింది. కూలి పనులకు వెళ్లి తిరిగి వెళుతుండగా అదుపుతప్పి కూలీలతో వెళుతున్న ట్రాక్టర్ నీటి గుంటలో పడిపోయింది. చనిపోయిన నలుగురు మహిళలు మొగిలిపేట గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు. మల్లాపూర్ మండలంలోని రత్నాపూర్లో మల్లన్న జాతర జరుగుతోంది. దీంతో.. ఈ జాతరకు వచ్చి తిరిగి వెళ్తుండగా ప్రమాదం జరిగిందని స్థానికులు భావించారు.
కానీ.. కూలి పనులు ముగించుకుని కూలీలతో తిరిగి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందని తెలిసింది. ఈ ప్రమాదం గురించి తెలిసిన వెంటనే పోలీసులు, రెస్క్యూ టీం రంగంలోకి దిగారు. మిగిలిన కూలీలను కాపాడే ప్రయత్నం చేశారు. కొందరు కూలీలకు స్వల్ప గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు. ట్రాక్టర్ డ్రైవర్ తెలిసిన దారేననే కాన్ఫిడెంట్గా చీకట్లో స్పీడ్గా వెళ్లడం వల్లే ప్రమాదం జరిగి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.
