మరికొద్దిరోజుల్లో ఈ ఏడాది అంటే 2025 అయిపోతుంది. అందరు కొత్త ఏడాది కోసం ఎంతో హుషారుతో ఎదురుచూస్తున్నారు. కానీ గోవా మాత్రం మెల్లిగా ఒక ప్రశాంతమైన బీచ్ ప్రాంతం నుండి ఆట, పాటల సందడితో క్రిస్మస్ హాలిడేస్, న్యూ ఇయర్ సెలెబ్రేషన్స్ కి బెస్ట్ ప్లేస్ గా మారబోతుంది. ఎందుకంటే ఈ టైంలో ఇక్కడ మీరు మెరిసే లైట్లతో నైట్ లైఫ్, చక్కని క్రిస్మస్ పాటలను వినోచ్చు ఇంకా గోవా ప్రత్యేకతను చూపించే పార్టీస్, ఈవెంట్స్ లో పాల్గొని ఎంజాయ్ చెయ్యొచ్చు.
గోవాలో క్రిస్మస్ అంటే అందరికీ నచ్చుతుంది. ప్రశాంతంగా బీచ్‌ల్లో ఎంజాయ్ చేసే వారి నుండి రాత్రంతా పార్టీలు చేసుకునే వారి వరకు.. ఇక్కడ అందరికీ ఏదో ఒకటి ఉంటుంది. గోవా పనాజీ వీధుల్లో తిరుగుతూ అక్కడి అందమైన డెకరేషన్స్, సెలెబ్రేషన్స్, హంగామా చూడవచ్చు. అంతేకాదు గోవాలో జరిగే ప్రత్యేక పార్టీస్ మిమ్మల్ని ఆకట్టుకుంటాయి.
ఈ ఏడాది చివరి రోజుల్లో గోవాలోని క్లబ్‌లు, ఇతర ప్రదేశాల్లో క్రిస్మస్ మ్యూజిక్ మార్మోగిపోతుంది. మీకు లైవ్ మ్యూజిక్‌తో పార్టీ చేసుకోవడం ఇష్టమైతే ఈ క్రిస్మస్‌కు గోవాలో బోలెడన్ని ఆప్షన్లు ఉన్నాయని BookMyShow చెబుతోంది.
2025లో గోవా క్రిస్మస్ ప్రోగ్రామ్స్, పార్టీలు వివరాలు...
1.వగలుమ్మె శాంటా స్నో పార్టీ - కలంగుట్ నైట్ లైఫ్
ఎక్కడంటే : వగలుమ్మే నైట్‌క్లబ్, కలంగుట్
టైమింగ్స్: డిసెంబర్ 24 సాయంత్రం నుండి అర్ధరాత్రి వరకు
ధర: రూ.1,000 నుండి
2.వగలుమ్మే బాడ్ శాంటా క్రిస్మస్ పార్టీ - కలంగుటే
ఎక్కడంటే : వాగలుమ్మే నైట్ క్లబ్, కలాంగూట్
టైమింగ్స్: సాయంత్రం నుండి అర్ధరాత్రి వరకు
ధర: రూ. 1,000 నుండి
3.క్రిస్మస్ బ్రంచ్ 2025 - ఫోక్సోసో లా అల్ఫోన్సో బీచ్ రిసార్ట్ & స్పా
ఎక్కడంటే : ఫోక్సోసో లా అల్ఫోన్సో బీచ్ రిసార్ట్ & స్పా, గోవా
టైమింగ్స్: డిసెంబర్ 25న ఉదయం 11:00 గంటల నుండి మధ్యాహ్నం 2:00 గంటల వరకు
ధర: రూ. 999 నుండి
4. ఫోంటైన్హాస్ క్రిస్మస్ వాక్ - పనాజిమ్
ఎక్కడంటే : జనరల్ పోస్ట్ ఆఫీస్, పంజిమ్
టైమింగ్స్: సాయంత్రం నుండి
ధర: రూ.900 నుండి
5. W క్రిస్మస్ బ్రంచ్ - W గోవా, వాగేటర్
ఎక్కడంటే : పశ్చిమ గోవా, వాగేటర్
టైమింగ్స్: డిసెంబర్ 25 ఉదయం నుండి మధ్యాహ్నం వరకు
ధర: రూ. 3,999 నుండి
