వందేళ్లయింది.. ఫ్లైట్లు మొదలై

వందేళ్లయింది.. ఫ్లైట్లు మొదలై

ప్రస్తుత ప్రపంచ రవాణా రంగంలో విమాన సర్వీసులది ఫస్ట్‌‌‌‌‌‌‌‌ ప్లేస్‌‌‌‌‌‌‌‌. తక్కువ టైంలోనే ఎక్కువ దూరాలకు ప్రయాణికులను చేరవేస్తున్నాయి. వస్తువులు, సరుకులను కూడా దేశాలు, ఖండాలు, సముద్రాలు దాటిస్తున్నాయి. మరి ఈ కమర్షియల్‌‌‌‌‌‌‌‌ విమాన సర్వీసులు మొదలై ఇప్పటికి ఎన్నేళ్లో తెలుసా? అక్షరాలా వందేళ్లు. 1919 ఆగస్టు 25న తొలి రెగ్యులర్‌‌‌‌‌‌‌‌ ఇంటర్నేషనల్‌‌‌‌‌‌‌‌ ప్యాసింజర్ ఎయిర్‌‌‌‌‌‌‌‌ సర్వీస్‌‌‌‌‌‌‌‌ మొదలైంది. మొదటిసారి ఇంగ్లాండ్‌‌‌‌‌‌‌‌లోని లండన్‌‌‌‌‌‌‌‌ నుంచి ఫ్రాన్స్‌‌‌‌‌‌‌‌లోని పారిస్‌‌‌‌‌‌‌‌కు బయల్దేరింది. ఇంగ్లాండ్‌‌‌‌‌‌‌‌లోని హౌన్‌‌‌‌‌‌‌‌స్లో హీత్‌‌‌‌‌‌‌‌ ప్రాంతం నుంచి ఈ జర్నీ స్టార్టయింది. అప్పటి ఈ ప్రదేశం ప్రస్తుత హీత్రూ ఎయిర్‌‌‌‌‌‌‌‌పోర్టుకు చాలా దగ్గర్లోనే ఉంది.  ఎయిర్‌‌‌‌‌‌‌‌ ట్రాన్స్‌‌‌‌‌‌‌‌పోర్ట్‌‌‌‌‌‌‌‌ అండ్‌‌‌‌‌‌‌‌ ట్రావెల్‌‌‌‌‌‌‌‌ లిమిటెడ్‌‌‌‌‌‌‌‌ (ఏటీ అండ్‌‌‌‌‌‌‌‌ టీ) సంస్థ ఈ సర్వీసులను ప్రారంభించింది.మొదటి ప్రపంచ యుద్ధ కాలంలో వాడిన డీ హవిలాండ్‌‌‌‌‌‌‌‌ డీహెచ్‌‌‌‌‌‌‌‌4ఏ జీ ఈఏజేసీ విమానాన్నే తొలి ప్యాసింజర్‌‌‌‌‌‌‌‌ సర్వీస్‌‌‌‌‌‌‌‌కు వాడారు. విమానంలో రోల్స్‌‌‌‌‌‌‌‌రాయ్స్‌‌‌‌‌‌‌‌ ఈగల్‌‌‌‌‌‌‌‌ పిస్టన్‌‌‌‌‌‌‌‌ ఇంజన్‌‌‌‌‌‌‌‌ను వాడారు. ఇంగ్లిష్‌‌‌‌‌‌‌‌ చానల్‌‌‌‌‌‌‌‌ మీదుగా రెండున్న గంటల్లో  ఫ్లైట్‌‌‌‌‌‌‌‌ గమ్యాన్ని చేరింది. ఈ ఓపెన్‌‌‌‌‌‌‌‌ ఎయిర్‌‌‌‌‌‌‌‌ కాక్‌‌‌‌‌‌‌‌పిట్‌‌‌‌‌‌‌‌ విమానాన్ని ఆర్‌‌‌‌‌‌‌‌ఏఎఫ్‌‌‌‌‌‌‌‌ వెటరన్‌‌‌‌‌‌‌‌ లెఫ్టినెంట్‌‌‌‌‌‌‌‌ హెచ్‌‌‌‌‌‌‌‌ బిల్‌‌‌‌‌‌‌‌ లాఫోర్డ్‌‌‌‌‌‌‌‌ నడిపించారు. అతనితో పాటు లండన్‌‌‌‌‌‌‌‌ ‘ఈవినింగ్‌‌‌‌‌‌‌‌ స్టాండర్డ్‌‌‌‌‌‌‌‌’ జర్నలిస్టు జార్జ్‌‌‌‌‌‌‌‌ స్టీవెన్‌‌‌‌‌‌‌‌సన్‌‌‌‌‌‌‌‌ ఉన్నారు. జర్నీ కోసం స్టీవెన్‌‌‌‌‌‌‌‌సన్‌‌‌‌‌‌‌‌ రూ.1,800 చెల్లించాడు. ఇప్పటి లెక్క ప్రకారం రూ.80 వేలు ఇచ్చాడన్నమాట. ఫ్లైట్‌‌‌‌‌‌‌‌ బయల్దేరినపుడు వాతావరణం అంత బాగా లేదు. వందేళ్ల కిందట విమాన ప్రయాణమంటే అదో పెద్ద సాహసం. తొలినాళ్లలో విమానం ఎక్కేందుకు ప్రజలను ఒప్పించాల్సి వచ్చేది. ఇదే విషయాన్ని అప్పటి క్యూరేటర్‌‌‌‌‌‌‌‌ పాల్‌‌‌‌‌‌‌‌ జార్విస్‌‌‌‌‌‌‌‌ తన పుస్తకం ‘బ్రిటిష్‌‌‌‌‌‌‌‌ ఎయిర్‌‌‌‌‌‌‌‌వేస్‌‌‌‌‌‌‌‌, 100 ఇయర్స్‌‌‌‌‌‌‌‌ ఆఫ్‌‌‌‌‌‌‌‌ ఏవియేషన్‌‌‌‌‌‌‌‌ పోస్టర్స్‌‌‌‌‌‌‌‌’లో వెల్లడించారు. కానీ 1919 జూన్‌‌‌‌‌‌‌‌ 15న జాన్‌‌‌‌‌‌‌‌ ఆల్‌‌‌‌‌‌‌‌కాక్‌‌‌‌‌‌‌‌, ఆర్థర్‌‌‌‌‌‌‌‌ బ్రౌన్‌‌‌‌‌‌‌‌ తొలిసారి అట్లాంటిక్‌‌‌‌‌‌‌‌ మీదుగా ఆగకుండా ప్రయాణించడంతో లండన్‌‌‌‌‌‌‌‌ టు న్యూయార్క్‌‌‌‌‌‌‌‌కు మార్గం సుగమమైంది. కమర్షియల్‌‌‌‌ ఫ్లైట్‌‌‌‌ మొదలైంది.

19 గంటల సుదూర ఫ్లైట్‌‌‌‌‌‌‌‌ జర్నీ

ప్రపంచంలోనే లాంగెస్ట్‌‌‌‌ ఫ్లైట్‌‌‌‌ను మొదలుపెట్టేందుకు ఆస్ట్రేలియా కంపెనీ ఖంటాస్‌‌‌‌ ప్రయత్నాలు మొదలుపెట్టింది.  ఆస్ట్రేలియా ఈస్ట్‌‌‌‌‌‌‌‌ కోస్ట్‌‌‌‌‌‌‌‌ నుంచి లండన్‌‌‌‌‌‌‌‌, న్యూయార్క్‌‌‌‌‌‌‌‌కు నాన్‌‌‌‌‌‌‌‌స్టాప్‌‌‌‌‌‌‌‌ ఫ్లైట్‌‌‌‌‌‌‌‌ సర్వీసులను నడిపేందుకు  టెస్ట్‌‌‌‌‌‌‌‌ ఫ్లైట్లను స్టార్ట్‌‌‌‌‌‌‌‌ చేస్తున్నట్టు ప్రకటించింది. అక్టోబర్‌‌‌‌‌‌‌‌, నవంబర్‌‌‌‌‌‌‌‌, డిసెంబర్‌‌‌‌‌‌‌‌లలో వీటిని నడుపుతామంది. 40 మంది ప్రయాణికులు డైరెక్ట్‌‌‌‌‌‌‌‌గా లండన్‌‌‌‌‌‌‌‌ నుంచి న్యూయార్క్‌‌‌‌‌‌‌‌కు వెళ్లనున్నారు. 19 గంటల జర్నీకి బోయింగ్‌‌‌‌‌‌‌‌ 787 విమానాలు వాడనుంది.  ఈ సుదూర ప్రయాణంలో ప్రయాణికుల ఆరోగ్యంపై పడే ప్రభావాన్ని తెలుసుకునేందుకు వైద్యుల సాయం తీసుకోనుంది. విమానంలోని సీట్లను ప్రత్యేకంగా డిజైన్‌‌‌‌‌‌‌‌ చేశారు. ప్యాసింజర్లకు మానిటరింగ్‌‌‌‌‌‌‌‌ పరికరాలు అమర్చుతారు. వాటి ద్వారా వాళ్ల హెల్త్‌‌‌‌‌‌‌‌ వివరాలను ఎప్పటికప్పుడు ఆస్ట్రేలియాలోని చార్లెస్‌‌‌‌‌‌‌‌ పెర్కిన్స్‌‌‌‌‌‌‌‌ సెంటర్‌‌‌‌‌‌‌‌లో తెలుసుకుంటుంటారు.

మరిన్ని వెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి