ప్రపంచంలోనే భారత్ ఫస్ట్: రెమిటెన్స్ లలో 100 బిలియన్ డాలర్ల మార్క్

ప్రపంచంలోనే భారత్ ఫస్ట్: రెమిటెన్స్ లలో 100 బిలియన్ డాలర్ల మార్క్

100 బిలియన్ డాలర్లకు పైగా రెమిటెన్స్ లు పొందిన మొదటి దేశంగా భారత్ చరిత్ర సృష్టించింది. టాప్ 5లో భారత్, మెక్సికో, చైనా, పిలిప్పీన్స్, ఫ్రాన్స్ లు ఉన్నాయి. దీంతోపాటు అత్యధిక సంఖ్యలో అంతర్జాతీయ వలసదారులను కలిగి ఉంది. యునైటెడ్ నేషన్స్ మేగ్రేషన్ ఏజెన్నీ ప్రకారం.. 2022లో 100 బిలియన్ డాలర్లకు పైగా రెమిటెన్స్ లను అందుకున్న మొదటి దేశంగా భారత్ నిలిచింది.రెండో స్థానంలో ఉన్న చైనాను అధిగమించి ఆ స్థానంలో మెక్సికో చేరింది. 

ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ మైగ్రేషన్ (IOM) తన ప్రపంచ వలస నివేదిక 2024లో భారత దేశం రెమిటెన్స్ లు గత సంవత్సరం 111 బిలియన్ డాలర్లకు పెరిగాయని,.. రెమెటెన్స్ లలో అన్ని దేశాలను అధిగమించి మొదటి స్థానంలో నిలించిందని వెల్లడించింది. 

రెమిటెన్స్ లలో భారత దేశం ఆధిపత్యం కొద్ది సంవత్సరాలుగా క్రమంగా పెరుగుతూ వచ్చింది. 2010లో 53.48 బిలియన్ డాలర్లుండగా, 2015లో 68.91 బిలియన్ డాలర్లు, 2020లో 83.15 బిలియన్ డాలర్లు, 2022లో 111.22 బిలియన్ డాలర్లతో రెమిటెన్స్ రిసిప్టులలో భారత్ మొదటి స్థానంలో ఉన్నట్లు నివేదికలు చెపుతున్నాయి. 

గత కొన్ని సంవత్సరాలుగా భారత్ నుంచి విదేశాలకు వెళ్తున్న వారి సంఖ్య క్రమక్రమంగా పెరుగుతూ వచ్చింది. భారత్ తో పాటుపాకిస్తాన్, బంగ్లాదేశ్ లు కూడా అంతర్జాతీయ రెమిటెన్సులు పొందుతున్న మొదటి పది దేశాలల్లో ఒకటిగా ఉన్నాయి. అంటే భారత్ నుంచి ఇతర దేశాలకు వెళ్లే వారి డిమాండ ఎంతుంతో అర్థమవుతుంది. 

అయితే ఈ నివేదికలు దక్షిణాసియా నుంచి వలచ్చి వలస కార్మికులుఎదుర్కొంటున్న సవాళ్లను కూడి నివేదిక వెల్లడించింది. ఆర్థిక దోపిడి, అధిక వలస ఖర్చులు, అధిక రుణాలు, జెనోఫోబియా, కార్యాలయాల్లో దుర్వినియోగం ఇలా అనేక సవాళ్లను నివేదికలు వెల్లడించాయి. 

నిర్మాణం, ఆతిథ్యం, భద్రత, ఇంటిపని, రిటైల్ వంటి రంగాల్లలో ఉపాధి పొందుతున్న భారత దేశం,ఈజిస్టు, బంగ్లాదేశ, ఇథియోపియా, కెన్యా నుంచి వలస వచ్చిన కార్మికులకు గల్ఫ్ రాష్ట్రాలు అనుకూలంగా దేశాలుగా ఉన్నాయి. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, యూనైటెడ్ స్టేట్స్, సైదీ అరేబియా వంటి దేశాలలో ఇండియన్ వలసదారులు ఎక్కువగా ఉన్నాయి. 

అయితే భారత దేశం కూడా వలసదారులను ఆకర్షిస్తోంది. అంతర్జాతీయ వలసదారులకు అనువైన దేశంగా ప్రపంచవ్యాప్తంగా 13 వ స్థానంలో భారత్ ఉంది.