- రాహుల్ గాంధీ అండతోనే కల్వకుంట్ల ఫ్యామిలీకి రక్షణ: ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రాన్ని పదేండ్లు దోచుకున్న బీఆర్ఎస్ నేతలు, ఇప్పుడు పాలిస్తు న్న కాంగ్రెస్ పార్టీ నాయకులు బయటికి కొట్టు కుంటున్నట్టు నటిస్తూ.. లోపల ఒకరినొకరు కాపాడుకుంటూ ప్రజలను మోసం చేస్తున్నార ని బీజేపీ మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ ఆరోపించారు. మంగళవారం బీజేపీ స్టేట్ ఆఫీస్లో మీడియాతో ఆయన మాట్లాడారు. దేశంలో కాంగ్రెస్ పార్టీ ఉనికి కోల్పోయిందని, ఆ పార్టీ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ఇద్దరూ బెయిల్ మీదనే బయట తిరుగు తున్నారని ప్రభాకర్ ఎద్దేవా చేశారు.
నాడు ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డిని కేసీఆర్ కాపాడారని.. ఇప్పుడు కేసీఆర్ కుటుంబాన్ని రేవంత్ రెడ్డి కాపాడుతున్నారని విమర్శించారు. రాహుల్ గాంధీ కనుసన్నల్లోనే ఈ డూప్ ఫైట్ నడుస్తోందని చెప్పారు. కల్వకుంట్ల కుటుంబం మొత్తం అవినీతి అక్రమాల్లో కూరుకుపోయింద ని ఆయన ఆరోపించారు. రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి.. కల్వకుంట్ల కుటుంబం మాత్రం కోట్లు వెనకేసుకుందని ప్రభాకర్ ఆరోపించారు.
