V6 News

‘మహా’ సంక్షోభం.. కాంగ్రెస్ అలర్ట్

‘మహా’ సంక్షోభం.. కాంగ్రెస్ అలర్ట్

మహారాష్ట్రలో రాజకీయాలు క్షణ క్షణానికి మారిపోతున్నాయి. శివసేన కూటమి ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు శివసేనకు చెందిన కీలక నేత ఏక్ నాథ్ షిండే తిరుబాటు బావుటా ఎగురవేశారు. ఆయన ఆధ్వర్యంలో 30 మందికి పైగా ఎమ్మెల్యేలు సూరత్ రిసార్ట్ కు షిప్ట్ అయ్యారు. ఒక్కసారిగా జరుగుతున్న పరిణామాలతో ప్రతిపక్షాలు అలర్ట్ అయ్యాయి. బీజేపీ పక్ష నేత మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవిస్.. ఢిల్లీకి చేరుకున్నారు. తాజా పరిణామాలతో వ్యవహారం అంతా కీలకంగా మారింది. రెబెల్ ఎమ్మెల్యేలు బీజేపీకి మద్దతు ప్రకటిస్తే ఏదైనా జరిగే అవకాశం ఉంది. మరోవైపు తాజా పరిణామాలతో కాంగ్రెస్ కూడా ముంబైలో తమ ఎమ్మెల్యేలతో అత్యవసరంగా భేటీ అయింది. మధ్యప్రదేశ్ మాజీ కాంగ్రెస్ చీఫ్ కమల్ నాథ్ ను ఏఐసీసీ (AICC) పరిశీలకుడిగా నియమించింది. ఈ  మేరకు ఓ నోట్ ను విడుదల చేసింది.

మొదటి నుంచి రెబెల్స్ గండం :-
మరోవైపు.. ఇవాళ రాత్రి శరద్ పవాన్, ఉద్ధవ్ థాక్రే మీటింగ్ జరగనుంది. ఇదిలా ఉంటే.. సూరత్ క్యాంప్ లో ఉన్న ఎమ్మెల్యేలతో మాట్లాడేందుకు వెళ్లిన ఉద్దవ్ థాక్రే అనుచరులను పోలీసులు అడ్డుకున్నారు.హోటల్ ముందే వారు బైఠాయించినట్లు తెలుస్తోంది. ఇటు ఎమ్మెల్యేలతో సీఎం ఉద్దవ్ థాక్రే భేటీ కొనసాగుతోంది. మహారాష్ట్రలో మహా వికాస్ అఘాడీ ప్రభుత్వానికి మొదటి నుంచి రెబెల్స్ గండం ఉంటూ వచ్చింది. కొద్దిలో బీజేపీ మెజార్టీకి దూరంగా ఉండిపోవడం, శివసేన ఎన్సీపీ, కాంగ్రెస్ తో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయడం అప్పట్లో పెద్ద టర్నింగ్ పాయింట్ గా మారింది. కానీ రెబెల్స్ బెడదతో పొలిటికల్ సీన్ ఒక్కసారిగా మారిపోయింది. మహారాష్ట్ర రాజకీయాల్లో ముందు నుంచే లుకలుకలు కనిపించాయి. నిన్న జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో 10 సీట్లకు గానూ ఐదింటిని బీజేపీ గెలుచుకోగా, ఎన్సీపీ, శివసేన రెండేసి గెలిచాయి. కాంగ్రెస్ ఒక ఎమ్మెల్సీ కైవసం చేసుకుంది. ఇందులోనూ క్రాస్ ఓటింగ్ జరిగినట్లు అనుమానాలు మరింతగా బలపడ్డాయి. ఐదో స్థానం బీజేపీ గెలవాలంటే 24 మంది ఇతర పార్టీల  ఎమ్మెల్యేల బలం అవసరమైంది.

మోసం చేయనన్న ఏక్ నాథ్ షిండే :-
దీంతో శివసేన సహా ఇతర పార్టీల నుంచి ఓట్లు వేయడం, బీజేపీ ఐదు ఎమ్మెల్సీ స్థానాలు గెలవడం చకచకా జరిగిపోయాయి. అది జరిగిన 24 గంటల్లోనే శివసేన మంత్రి ఏక్ నాథ్ షిండే 30 మందికి పైగా ఎమ్మెల్యేలతో సూరత్ రిసార్ట్ వెళ్లడం కీలకంగా మారింది. అధికారం కోసం తాను మోసం చేయనని ఏక్ నాథ్ షిండే అన్నారు. బాల్ ఠాక్రే బోధనలను తాను వదిలిపెట్టబోననన్నారు. ప్రస్తుతం 12 మంది ఎమ్మెల్యేలతో షిండే సూరత్లోని ఓ హోటల్లో ఉంటున్నారు. అయితే ఆనకు మరింత మంది ఎమ్మెల్యేల మద్దతు ఉన్నట్లు తెలుస్తోంది. ఉద్ధవ్ థాక్రే నిర్వహించిన సమావేశానికి కొంతమంది శివసేన ఎమ్మెల్యేలు రాలేదు