రాజీవ్ గాంధీకి ఘన నివాళి

రాజీవ్ గాంధీకి ఘన నివాళి

హైదరాబాద్, వెలుగు: మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా గురువారం గాంధీ భవన్​లో ఆయన ఫొటో వద్ద పలువురు కాంగ్రెస్ నేతలు నివాళులర్పించారు. ఏఐసీసీ కార్యదర్శి సచిన్ సావంత్, ఎమ్మెల్యే దానం నాగేందర్​తో పాటు పలువురు పార్టీ నేతలు పాల్గొన్నారు. అనంతరం సిటీ కాంగ్రెస్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం, ఫొటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు.

సచిన్ సావంత్ మాట్లాడుతూ..18 ఏళ్లకే ఓటు  హక్కు కల్పించడం, ఐటీని పరిచయం చేయడం వంటి ఎన్నో చారిత్రాత్మక నిర్ణయాలు రాజీవ్ గాంధీ ప్రధానిగా ఉన్నప్పుడు తీసుకున్నవేనని గుర్తు చేశారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో బీజేపీ అల్లర్లు సృష్టిస్తోందని ఆరోపించారు. ‘సర్’ ను తీసుకువచ్చి రాజ్యాంగానికి తూట్లు పొడిచారని బీజేపీ సర్కార్​పై ధ్వజమెత్తారు. దేశాన్ని అమెరికా కాళ్ల దగ్గర తాకట్టు పెట్టారని విమర్శించారు