సోనీ కిడ్నాపర్ రవి శంకర్ అరెస్ట్

 సోనీ కిడ్నాపర్ రవి శంకర్ అరెస్ట్

ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి హైదరాబాద్ యువతి సోనీని కిడ్నాప్ చేసి తీసుకెళ్లిన రవి శంకర్ ను పోలీసులు ఇవాళ(మంగళవారం) ఉదయం అరెస్ట్ చేశారు. నిన్న(సోమవారం) రాత్రి ప్రకాశం జిల్లా అద్దంకిలో సోనీని కిడ్నాపర్ విడిచిపెట్టగా, ఆమె హైదరాబాద్ చేరుకుని హయత్ నగర్ పోలీసులకు సమాచారం ఇవ్వడంతోనే, ఆ సమాచారాన్ని ప్రకాశం జిల్లా పోలీసులకు చేరవేశారు. దీంతో ప్రకాశం జిల్లా పోలీసులు అలర్టయ్యారు. ఒంగోలు శివార్లలో రవి శంకర్ ను గుర్తించిన పోలీసులు అరెస్ట్ చేసి… హైదరాబాద్ కు తరలించారు. ప్రస్తుతం రవి శంకర్ హయత్ నగర్ పోలీసుల అదుపులో ఉన్నాడు.

ఉద్యోగం ఇప్పిస్తానని మాయమాటలు చెప్పిన రవి శంకర్ ఈ నెల 23న బళ్లారి నుంచి చోరీ చేసుకొచ్చిన కారులో సోనీ  యువతిని కిడ్నాప్ చేశాడు. యువతి కిడ్నాప్ పై ఆమె తండ్రి హయత్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు.