చైనా నుంచి దిగుమతులు పెరుగుతూనే ఉన్నాయ్‌‌

చైనా నుంచి దిగుమతులు పెరుగుతూనే ఉన్నాయ్‌‌

న్యూఢిల్లీ: టెలికం మెషినరీ, ఎలక్ట్రానిక్స్ వంటి పరిశ్రమలకు అవసరమయ్యే ప్రొడక్ట్‌‌ల  కోసం చైనాపై ఆధారపడడం పెరుగుతోంది.  ఈ దేశం నుంచి ఇండియా చేసుకుంటున్న ఇండస్ట్రియల్ ప్రొడక్ట్‌‌ల దిగుమతులు గత 15 ఏళ్లలో 21 శాతం నుంచి 30 శాతానికి  పెరిగాయి. చైనాతో పెరుగుతున్న ట్రేడ్ డెఫిసిట్‌‌ ఆందోళన కలిగించే అంశమని గ్లోబల్‌‌ ట్రేడ్‌‌ రీసెర్చ్ ఇనీషియేటివ్ (జీటీఆర్‌‌‌‌ఐ) పేర్కొంది.  

2019–2024 మధ్య  ఇండియా నుంచి చైనాకు అయిన ఎగుమతులు ఏడాదికి 16 బిలియన్ డాలర్ల దగ్గరనే ఉన్నాయి. కానీ, చైనా నుంచి దిగుమతులు మాత్రం 2018–19 లో 7‌‌‌‌0.3 బిలియన్ డాలర్లు ఉంటే 2023–24 నాటికి 101 బిలియన్ డాలర్లకు పెరిగాయి. ఈ టైమ్‌‌లో మొత్తంగా 387 బిలియన్ డాలర్ల ట్రేడ్ డెఫిసిట్ ఏర్పడింది.  గ్లోబల్‌‌గా వివిధ దేశాల నుంచి  చేసుకుంటున్న మొత్తం 337 బిలియన్ డాలర్ల ఇండస్ట్రియల్ ప్రొడక్ట్‌‌ల్లో చైనా వాటా 30 శాతానికి పెరిగింది.