కేంద్ర సాహిత్య అకాడమీకి మణిపూర్ ​ఫిల్మ్ అవార్డు

కేంద్ర సాహిత్య అకాడమీకి మణిపూర్ ​ఫిల్మ్ అవార్డు

హైదరాబాద్, వెలుగు: కేంద్ర సాహిత్య అకాడమీకి మణిపూర్ రాష్ట్ర చలనచిత్ర పురస్కారం లభించింది. సుప్రసిద్ధ మణిపురీ రచయిత ప్రకాశ్ సింగ్ జీవిత సాహిత్యాలపై అకాడమీ రూపొందించిన డాక్యుమెంటరీ చిత్రానికి ఉత్తమ జీవిత చరిత్ర, కళా సాంస్కృతిక చిత్రాల విభాగంలో ఈ పురస్కారం లభించింది. ఇంఫాల్ లో వైభవంగా జరిగిన పురస్కారాల మహోత్సవంలో ఆ రాష్ట్ర గవర్నర్ అనుసూయ ఉయికే  చేతుల మీదుగా కేంద్ర సాహిత్య అకాడమీ కార్యదర్శి డాక్టర్ కృత్తివెంటి శ్రీనివాసరావు పురస్కారం అందుకున్నారు. 

డాక్యుమెంటరీకి దర్శకత్వం వహించిన ప్రముఖ రచయిత ఆరిబమ్ శర్మకు ఉత్తమ డైరెక్టర్,  చోంగ్ తమ్ కమలాకు ఉత్తమ వాయిస్ ఓవర్ పురస్కారం లభించాయి. వివిధ భారతీయ భాషలకు చెందిన సాహితీ ప్రముఖుల జీవన ప్రస్థానంపైన సాహిత్య అకాడమీ ఇప్పటిరకు 172 డాక్యుమెంటరీ చిత్రాలు నిర్మించింది. సాహిత్య అకాడమీ డాక్యుమెంటరీకి ఓ రాష్ట్ర ప్రభుత్వ చలనచిత్ర పురస్కారం లభించడం ఇదే మొదటిసారి.