దేశంలో కొనసాగుతున్న కరోనా వ్యాప్తి

దేశంలో కొనసాగుతున్న కరోనా వ్యాప్తి

దేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతేంది. దేశంలో కొత్త కేసులు 3 వేల దిగువనే ఉన్నాయి. దేశవ్యాప్తంగా 2 వేల 259 కరోనా కేసులు నమోదయ్యాయి. నిన్నటితో పోలిస్తే.. కేసులు కాస్త తగ్గాయి. రోజు వారి పాజిటివిటీ రేటు 0.53 శాతానికి తగ్గింది. కొత్త కేసుల కంటే రికవరీలే అధికంగా ఉన్నాయి. 24 గంటల వ్యవధిలో 2 వేల 614 మంది కోలుకున్నారు. దేశంలో ప్రస్తుతం 15 వేల 44 యాక్టివ్ కేసులున్నాయి. నిన్న మరో 20 మంది వైరస్ బారిన పడి చనిపోయారు. ఇప్పటివరకు 192.96 కోట్లకు పైగా టీకా డోసులు పంపిణీ చేసినట్లు తెలిపింది కేంద్రం.