కరోనా మరణాల రేటు మన దగ్గరే తక్కువ

కరోనా మరణాల రేటు మన దగ్గరే తక్కువ

న్యూఢిల్లీ : కరోనా మరణాల రేటు ప్రపంచవ్యాప్తంగా మన దేశంలోనే తక్కువగా ఉందని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ తెలిపారు. భారత్ లో మరణాల రేటు 3.2 శాతం మాత్రమేనన్నారు. కేసుల సంఖ్య పెరుగుతున్నప్పటీ మరణాలు తక్కువగా ఉండటం సంతోషించాల్సిన విషయమని చెప్పారు. కరోనా పాజిటివ్ వచ్చిన వారు కూడా త్వరగా కోలుకుంటున్నారన్నారు. ఇప్పటి వరకు 10 వేల మందికి పైగా కరోనా నుంచి కోలుకోని డిశ్ఛార్జ్ అయ్యారని వెల్లడించారు. మన వద్ద ప్రస్తుతం కరోనా కేసులు రెట్టింపు అవటానికి 12 రోజుల సమయం పడుతుందని రెండు వారాల క్రితం వరకు ఇది పదిన్నర రోజులు ఉండేదని హర్షవర్ధన్ తెలిపారు. కాగా దేశంలో కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. దాదాపు 40 వేల చేరువకు కరోనా కేసులు చేరగా….ఇప్పటి వరకు 1301 మంది చనిపోయారు.