గచ్చిబౌలిలో కరోనా హాస్పిటల్ రెడీ

గచ్చిబౌలిలో కరోనా హాస్పిటల్ రెడీ
  •     గచ్చిబౌలిలో ఎల్లుండి ప్రారంభం
  •     1500 బెడ్స్, 50 వెంటిలేటర్లు
  •     అందుబాటులో డాక్టర్లు, మెడికల్​ స్టాఫ్

హైదరాబాద్, వెలుగు: కరోనా పేషెంట్లకు ట్రీట్​మెంట్​ అందించేందుకు 1500 బెడ్స్, 50వెంటిలేటర్లతో గచ్చిబౌలిలో హాస్పిటల్ సిద్ధమైంది. ఈ నెల 20న ప్రారంభం కానుంది. గాంధీ హాస్పిటల్ ను ఇప్పటికే పూర్తిస్థాయిలో కరోనా పేషెంట్ల కోసం వాడుతుండగా.. కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఇబ్బందులు రాకుండా బాలయోగి స్టేడియం స్పోర్ట్స్ అథారిటీ హాస్టల్ కాంప్లెక్స్ ను ప్రభుత్వం కరోనా హాస్పిటల్ గా మార్చింది. సీనియర్​ఐఏఎస్​ఎం.రఘునందన్​రావుకు బాధ్యతలు అప్పగించగా, 20 రోజుల్లో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఫర్నిచర్, మెడికల్ కిట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తోపాటు ఇతర ఎక్విప్ మెంట్ ను సిద్ధం చేశారు. 153 మంది డాక్టర్లు అందుబాటులో ఉండనున్నారు. వారిలో స్పెషలిస్ట్​లు, డైరెక్టర్ ఆఫ్ హెల్త్ కింద పనిచేస్తూ డిప్యూటేషన్ పై వచ్చిన వారూ ఉన్నారు. 228 మంది నర్సులు, పారామెడికల్ స్టాఫ్ ఇక్కడ సేవలందించనున్నారు. శానిటేషన్, పేషెంట్​ కేర్,సెక్యూరిటీ కోసం 578 మంది ఫోర్త్​ క్లాస్​ ఎంప్లాయీస్ ను తీసుకున్నారు. హాస్పిటల్ బిల్డింగ్​లో 13 ఫ్లోర్స్ ఉండగా, 468 రూమ్స్ లో 1500 బెడ్స్ తో ఐసోలేషన్ వార్డులను ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు.

ఫ్యూచర్​లో సూపర్​ స్పెషాలిటీ హాస్పిటల్

కరోనా పూర్తిగా కంట్రోల్​కి వచ్చే వరకూ ఇక్కడ పేషెంట్లకు ట్రీట్ మెంట్ అందించనున్నారు. ఆ తర్వాత ఈ బిల్డింగ్​ను సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ గా కొనసాగించనున్నట్టు సమాచారం.  శివారు ప్రాంతాల్లో  4 సూపర్​ స్పెషాలిటీ ఆస్పత్రులు నిర్మిస్తామని గతంలో ప్రభుత్వ హామీలో భాగంగా దీన్ని ఉపయోగించనున్నట్లు తెలిసింది. అదేజరిగితే హైదరాబాద్, రంగారెడ్డి, వికారాబాద్, మహబూబ్​నగర్, సంగారెడ్డి  జిల్లాల ప్రజలకు సౌకర్యంగా ఉంటుంది. స్టేడియానికి హాస్టల్ కాంప్లెక్స్
అవసరమైతే దీని స్థానంలో మరొకటి నిర్మించే అవకాశమున్నట్లు తెలిసింది.