400 కిలోల ఇరాన్ యురేనియం కోసం ట్రంప్ భారీ స్కెచ్ !

400 కిలోల ఇరాన్ యురేనియం కోసం ట్రంప్ భారీ స్కెచ్ !
  • హార్మూజ్ తెరవకుంటే సర్వనాశనం చేస్తం.. ఇరాన్​కు డొనాల్డ్ ట్రంప్ అల్టిమేటం
  • మాతో డీల్ కుదుర్చుకోకుంటే చమురు బావులను పేల్చేస్తం
  • విద్యుత్ కేంద్రాలపై భీకర దాడులు చేస్తామని వార్నింగ్
  • 60 శాతం స్వచ్ఛత కలిగిన 400 కిలోల యురేనియంపై ట్రంప్ కన్ను
  • స్వాధీనానికి భూతల దాడులకు సిద్ధపడుతున్న అమెరికా ప్రెసిడెంట్
  • కువైట్​లోని డీశాలినేషన్​ ప్లాంట్​పై ఇరాన్ మిసైల్ దాడి
  • ఇరాక్కు థ్యాంక్స్ .. మొజ్తబా లేఖ

వాషింగ్టన్/ టెహ్రాన్/ జెరూసలెం: పశ్చిమాసియాలో పట్టు కోసం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇరాన్ పై మరింత ఒత్తిడి పెంచి తమతో డీల్ కుదుర్చుకునేలా కట్టడి చేయాలని ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగానే తాజాగా ఇరాన్ కు అల్టిమేటం జారీ చేశారు. హార్మూజ్ జలసంధిని వెంటనే తెరవడంతో పాటు తమతో డీల్ కుదుర్చుకోవాలని వార్నింగ్ ఇచ్చారు. డీల్ కుదుర్చుకోవడానికి ఒప్పుకోకుంటే ఇరాన్ ను సర్వనాశనం చేస్తామని, ఆయిల్ బావులను పేల్చేస్తామని బెదిరింపులకు దిగారు. 

ఇరాన్ లోని కీలక విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలతో పాటూ మౌలిక సదుపాయాలపై మెరుపు దాడులు నిర్వహించి విధ్వంసం సృష్టిస్తామని తేల్చిచెప్పారు. వాస్తవానికి ఇరు దేశాల మధ్య చర్చలు జరుగుతున్నాయని, సానుకూల ఫలితాల వైపు ముందుకు వెళుతున్నామని ట్రంప్ చెప్పారు. అయితే, అది సరిపోదని కూడా ఆయన వ్యాఖ్యానించారు. ఈ విషయంలో గతంలో చేసిన హెచ్చరికలను ట్రంప్ గుర్తుచేశారు. తమతో డీల్ కుదర్చుకోకుంటే ఇరాన్ ఎనర్జీ స్థావరాలపై కనీవినీ ఎరగని రీతిలో దాడులు చెప్పారు. ఇందుకు 5 రోజులు గడువు ఇచ్చిన ట్రంప్.. తర్వాత దానిని మరో పది రోజులకు పెంచారు.

ఏప్రిల్ 6వ తేదీ గడువు..
తాజా హెచ్చరికల్లో మాత్రం వీలైనంత తొందరగా డీల్ కు అంగీకరించాలంటూ ఇరాన్ పై ట్రంప్ ఒత్తిడి పెంచారు. ఏప్రిల్ 6వ తేదీలోపు డీల్ కు కుదుర్చుకోవాలని ఆయన స్పష్టం చేశారు. సమయం గడుస్తున్న కొద్దీ పరిస్థితులు ఇరాన్‌‌‌‌కు మరింత క్లిష్టంగా మారుతాయని, తాము ఇచ్చే ఆఫర్ మరింత కఠినంగా ఉంటుందని హెచ్చరించారు. మరోవైపు, ఇరాన్ లోని 60 శాతం శుద్ధి చేసిన యురేనియం నిల్వలు 400 కేజీలు ఉన్నాయని, వాటిని ఎలాగైనా సొంతం చేసుకోవాలనే ఉద్దేశంతో ట్రంప్ భూతల దాడులకూ సిద్ధమవుతున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. 

ఇందుకోసం అమెరికా సైనికులను పెద్ద సంఖ్యలో పశ్చిమాసియాకు తరలిస్తున్నట్లు వార్తలు వెలువడుతున్నాయి. అత్యంత శక్తిమంతమైన క్షిపణులు, బాంబర్ విమానాలను కూడా తరలించినట్లు అంతర్జాతీయ మీడియాలో వార్తలు వెలువడుతున్నాయి. ఒకవేళ ఇరాన్ తన అణు కార్యకలాపాలను నిలిపివేయకపోతే లేదా అమెరికా ప్రతిపాదించిన ఒప్పందానికి అంగీకరించకపోతే, నిమిషాల వ్యవధిలోనే ఖర్గ్ ఐలాండ్‌‌‌‌ను ధ్వంసం చేస్తామని అమెరికా సైనిక వర్గాలు హెచ్చరిస్తున్నాయి. ఇరాన్ కు ఆర్థిక మూలస్తంభంగా ఉన్న ఖర్గ్ ఐలాండ్​ను స్వాధీనం చేసుకోవడం ద్వారా ఆ దేశాన్ని కట్టడి చేయాలని ట్రంప్ భావిస్తున్నట్లు సమాచారం.

క్షిపణులు, డ్రోన్ దాడుల విరుచుకు పాటు ఇరాన్ తన అత్యాధునిక క్షిపణులు, ఆత్మాహుతి డ్రోన్లతో ఇజ్రాయెల్ మరియు ఈ ప్రాంతంలోని అమెరికా స్థావరాలను లక్ష్యంగా చేసుకుంటోంది. దీనికి ప్రతిగా అమెరికా తన యుద్ధ విమానాలు, రక్షణ వ్యవస్థలతో ఇరాన్ ప్రయోగించిన డ్రోన్లను మధ్యలోనే అడ్డుకుంటోంది. ప్రపంచ చమురు రవాణాకు అత్యంత కీలకమైన 'హార్ముజ్ జలసంధి'ని మూసివేస్తామని ఇరాన్ హెచ్చరిస్తోంది. ఒకవేళ ఇక్కడ రవాణా నిలిచిపోతే, చమురు సరఫరాకు తీవ్ర విఘాతం కలుగుతుంది. దీనివల్ల అంతర్జాతీయ మార్కెట్‌‌‌‌లో క్రూడాయిల్ ధరలు ఆకాశాన్ని తాకే ప్రమాదం ఉంది.

దుబాయ్, కువైట్ ప్రాంతాల్లో హై అలర్ట్
యుద్ధం గల్ఫ్ దేశాలకు వ్యాపించే అవకాశం ఉండటంతో దుబాయ్, కువైట్ వంటి వాణిజ్య కేంద్రాలలో హై అలర్ట్ ప్రకటించారు. పౌర విమానయానం మరియు నౌకాయాన మార్గాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. అమెరికా తన సైనిక బలగాలను కువైట్ మరియు ఇతర స్థావరాలలో మోహరించింది. ఈ యుద్ధ వాతావరణం వల్ల ప్రపంచ స్టాక్ మార్కెట్లు కుప్పకూలుతున్నాయి. బంగారం ధరలు పెరుగుతుండగా, చమురు సరఫరాపై అనిశ్చితి నెలకొంది. భారత్ వంటి దేశాలకు చమురు దిగుమతులు ఖరీదైనవిగా మారే అవకాశం ఉంది. ప్రస్తుతానికి ఇరు దేశాల మధ్య దౌత్యపరమైన చర్చలకు తావు లేకుండా పోయింది. ఇజ్రాయెల్ కూడా ఇరాన్ దాడులకు ప్రతీకారం తీర్చుకుంటామని ప్రకటించడంతో, పశ్చిమమాసియా ఓ పెద్ద యుద్ధ భూమిగా మారే ప్రమాదం కనిపిస్తోంది.

ఇరాన్ స్పీకర్ నుంచి ‘గిఫ్ట్’ అంటూ మైండ్ గేమ్
డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌‌‌‌తో జరుగుతున్న యుద్ధంలో మరో సంచలన మలుపు ఇచ్చారు. ఇరాన్ పార్లమెంటు స్పీకర్ మొహమ్మద్ బాఘర్ గాలిబాఫ్ నుంచి తనకు ఒక భారీ ‘బహుమతి’ అందిందని, అయితే తమ డిమాండ్లకు లొంగకపోతే ఇరాన్ ప్రధాన చమురు కేంద్రం ఖర్గ్ ఐలాండ్‌‌‌‌ ను నేరుగా స్వాధీనం చేసుకుంటామని హెచ్చరించారు. ఇరాన్ తన పట్టును సడలిస్తూ, హార్మూజ్ జలసంధి గుండా 20 భారీ చమురు ట్యాంకర్లు సురక్షితంగా వెళ్లేందుకు అనుమతించిందని ట్రంప్ వెల్లడించారు. దీని విలువ కొన్ని వేల కోట్ల డాలర్లు ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ఈ నిర్ణయాన్ని ఇరాన్ స్పీకర్ గాలిబాఫ్ స్వయంగా ఆమోదించారని, దీనిని చర్చలకు ముందస్తుగా ఇచ్చిన ‘గిఫ్ట్’గా ట్రంప్ అభివర్ణించారు.

ఎగుమతుల్లో 90 శాతం ఇక్కడి నుంచే..
‘నాకు ఇరాన్ చమురును తీసుకోవడం అంటే చాలా ఇష్టం’ అని వ్యాఖ్యానించిన ట్రంప్, ఒకవేళ ఏప్రిల్ 6 లోపు చర్చలు సఫలం కాకపోతే ఖర్గ్ ఐలాండ్‌‌‌‌ను అమెరికా సైన్యం స్వాధీనం చేసుకుంటుందని స్పష్టం చేశారు. ఇరాన్ ఎగుమతి చేసే చమురులో 90% ఇక్కడి నుంచే వెళ్తుంది, కాబట్టి దీనిని కోల్పోతే ఆ దేశం ఆర్థికంగా పతనమవుతుంది. గతంలో వెనిజులా చమురుపై నియంత్రణ సాధించిన విధంగానే, ఇరాన్ చమురు బావులను కూడా ఆధీనంలోకి తీసుకుంటామని ట్రంప్ సంకేతాలిచ్చారు. దీని కోసం ఇప్పటికే 10,000 మంది అమెరికా సైనికులను పశ్చిమాసియాకు తరలించారు.

400 కిలోల యురేనియం కోసం భారీ స్కెచ్!
ఇరాన్‌‌‌‌పై డొనాల్డ్ ట్రంప్ అత్యంత సాహసోపేతమైన ‘గ్రౌండ్ ఆపరేషన్’ కు సిద్ధమవుతున్నారు. ఇరాన్ వద్ద ఉన్న దాదాపు 400 కిలోల అత్యంత శుద్ధి చేసిన యురేనియంను నేరుగా స్వాధీనం చేసుకోవడమే ఈ మిషన్ ప్రధాన లక్ష్యం. కేవలం గగనతల దాడులకే పరిమితం కాకుండా, అమెరికా ప్రత్యేక బలగాలను రంగంలోకి దించే అవకాశం ఉంది. ఇరాన్ భూగర్భ అణు కేంద్రమైన నతాంజ్ లక్ష్యంగా మెరుపు దాడి జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. అమెరికా సైనికులు నేరుగా అణు కేంద్రాల్లోకి ప్రవేశించి, అక్కడ నిల్వ ఉన్న అణు ఇంధనాన్ని డబ్బాల్లో నింపి సురక్షితంగా తరలించాలని పెంటగాన్ యోచిస్తోంది.

అత్యంత ప్రమాదకరమైన ప్లాన్..
ఈ ప్లాన్ అమలు చేయడం అత్యంత ప్రమాదకరమని రక్షణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. అణు కేంద్రంపై భౌతిక దాడులు జరిగితే భారీ స్థాయిలో లీక్ అయ్యే అవకాశం ఉంది. ఇది ఆ ప్రాంతంలో పెను విపత్తుకు దారితీయడమే కాకుండా, వేలాది మంది ప్రజల ప్రాణాలను ప్రమాదంలో పడేస్తుంది. అంతేకాకుండా, ఈ అణుకేంద్రాలకు ఇరాన్ తన అత్యంత శక్తిమంతమైన ‘రివల్యూషనరీ గార్డ్స్’  తో భద్రత కల్పించిందని, అక్కడ అమెరికా సైన్యం భారీ స్థాయిలో ప్రతిఘటన ఎదుర్కోవాల్సి ఉంటుందని పేర్కొన్నారు.

హార్మూజ్​లో సీమైన్స్‌‌‌‌‌‌‌‌ పేల్చే డ్రోన్లు
టెహ్రాన్‌‌‌‌‌‌‌‌: హార్మూజ్‌‌‌‌‌‌‌‌ జలసంధిలో శత్రు నౌకలను పేల్చివేసేందుకు ఇరాన్‌‌‌‌‌‌‌‌ ఏర్పాటు చేసిన ‘సీమైన్స్‌‌‌‌‌‌‌‌’ పనిపట్టేందుకు యూకే రంగంలోకి దిగనుంది. అమెరికా మిత్ర దేశాల షిప్‌‌‌‌‌‌‌‌లు జలసంధిలోకి ప్రవేశిస్తే వాటిని అడ్డుకునేందుకు సముద్రంలో ఏర్పాటు చేసిన సీమైన్స్‌‌‌‌‌‌‌‌ను అండర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వాటర్ డ్రోన్లతో పేల్చివేయాలని నిర్ణయించింది. ఈ డ్రోన్లను తమ రాయల్‌‌‌‌‌‌‌‌ ఫ్లీట్‌‌‌‌‌‌‌‌ నౌకల్లో అమర్చేందుకు యూకే ప్రణాళికలు చేస్తోంది. వీటి సాయంతో సీమైన్స్‌‌‌‌‌‌‌‌ను గుర్తించి, నిర్వీర్యం చేయనుంది.

ఇరాక్​కు థ్యాంక్స్ చెప్పిన మొజ్తబా
టెహ్రాన్‌‌‌‌‌‌‌‌: ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ నుంచి మరో లేఖ రిలీజైంది. ఇజ్రాయెల్‌‌‌‌, అమెరికాతో జరుగుతున్న యుద్ధంలో తమకు మద్దతు తెలిపిన ఇరాక్ ప్రజలకు ధన్యవాదాలని అందులో పేర్కొన్నారు. ఈ సందేశం బాగ్దాద్‌‌‌‌లో ఇరాన్ రాయబారి, ఇస్లామిక్ సుప్రీం కౌన్సిల్ ఆఫ్ ఇరాక్ మధ్య జరిగిన సమావేశం తర్వాత రిలీజ్​ అయిందని ఇరాన్​ వార్తా సంస్థ తెలిపింది. కాగా, మొజ్తబా ఖమేనీ అసలు బతికున్నాడో, లేడోనని  అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన కామెంట్స్  నేపథ్యంలో ఈ లేఖ రిలీజ్​ కావడం గమనార్హం.

కువైట్‌‌‌‌పై దాడి.. ఇండియన్​ మృతి
దుబాయ్: కువైట్‌‌‌‌లోని పవర్, వాటర్​ డీశాలినేషన్ ప్లాంట్‌‌‌‌పై ఇరాన్ చేసిన దాడిలో ఒక ఇండియన్​ మృతి చెందాడు. కువైట్ విద్యుత్​ మినిస్ట్రీ తెలిపిన వివరాల ప్రకారం.. ఆదివారం జరిగిన ఈ దాడిలో ప్లాంట్‌‌‌‌లోని ఒక సర్వీస్ భవనం దెబ్బతిన్నది. ఈ ఘటనలో అక్కడ పనిచేస్తున్న భారత కార్మికుడు మృతి చెందినట్లు వెల్లడించారు. కువైట్‌‌‌‌లోని ఇండియా ఎంబసీ ఈ ఘటనను ధ్రువీకరించింది. దీంతో ఇప్పటివరకు యుద్ధం వల్ల వివిధ చోట్ల మరణించిన భారతీయుల సంఖ్య ఎనిమిదికి చేరింది.

స్పెయిన్‌‌‌‌‌‌‌‌ ఎయిర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్పేస్‌‌‌‌‌‌‌‌ మూసివేత
మాడ్రిడ్‌‌‌‌‌‌‌‌: నాటో కూటమిలో సభ్యదేశమైన స్పెయిన్‌‌‌‌‌‌‌‌ అమెరికాకు షాక్‌‌‌‌‌‌‌‌ ఇచ్చింది. అమెరికా యుద్ధ విమానాలకు తమ గగనతలాన్ని మూసివేస్తున్నట్లు ప్రకటించింది. సోమవారం మాడ్రిడ్‌‌‌‌‌‌‌‌లో జరిగిన మీడియా సమావేశంలో స్పెయిన్‌‌‌‌‌‌‌‌ డిఫెన్స్ మినిస్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మార్గరీటా రోబుల్స్‌‌‌‌‌‌‌‌ ఈ విషయాన్ని అధికారికంగా వెల్లడించారు. ఇరాన్‌‌‌‌‌‌‌‌పై యుద్ధానికి సంబంధించి ఎలాంటి సైనిక చర్యలకైనా తమ గగనతలాన్ని గానీ, సంయుక్త సైనిక స్థావరాలను గానీ ఉపయోగించుకోవడానికి అనుమతించబోమని స్పష్టం చేశారు.

పాకిస్తాన్‌‌‌‌‌‌‌‌ మధ్యవర్తిత్వం మాకొద్దు
టెహ్రాన్​:
అమెరికా, ఇరాన్‌‌‌‌‌‌‌‌ మధ్య మధ్యవర్తిత్వం వహించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని పాకిస్తాన్‌‌‌‌‌‌‌‌ చేసిన ప్రకటనను ఇరాన్‌‌‌‌‌‌‌‌ తోసిపుచ్చింది. ఈ విషయంలో పాకిస్తాన్‌‌‌‌‌‌‌‌ అవసరం తమకు లేదని స్పష్టం చేసింది. ఈ మేరకు సోమవారం ముంబైలోని ఇరాన్‌‌‌‌‌‌‌‌ కాన్సులేట్‌‌‌‌‌‌‌‌ జనరల్‌‌‌‌‌‌‌‌ ఒక ప్రకటన విడుదల చేశారు. అమెరికాతో ఎలాంటి ప్రత్యక్ష చర్చలు జరగడం లేదని, మధ్యవర్తుల ద్వారా తమకు అమెరికా అసమంజసమైన డిమాండ్లు మాత్రమే తమకు అందుతున్నాయన్నారు.