న్యూఢిల్లీ: దేశ రాజధానిలో సోమవారం పసిడి, వెండి ధరలు భారీగా పెరిగాయి. పెళ్లిళ్ల సీజన్ కొనుగోళ్లు పెరగడం ఇందుకు కారణం. ఆల్ ఇండియా సరాఫా అసోసియేషన్ ప్రకారం, వెండి ధర కిలోకు రూ.ఏడు వేలు పెరిగి రూ.2.37 లక్షలకు చేరింది.
బంగారం ధర 10 గ్రాములకు రూ.3,700 పెరిగి రూ.1,51,500 వద్ద ముగిసింది. అంతర్జాతీయ మార్కెట్లలో సానుకూల పరిస్థితులు, రూపాయి విలువ క్షీణించడం వంటివి దేశీయ ధరలపై ప్రభావం చూపాయి. ఈ నెలలో బంగారం ధరలు 12.3 శాతం, వెండి 21 శాతం వరకు తగ్గినప్పటికీ సోమవారం మాత్రం పుంజుకున్నాయి.
