జ్యోతిష్యం: గ్రహాల రాజు సూర్యుడు నక్షత్రం మార్పు.. ఇక ఆ నాలుగు రాశులు వారు పట్టింది బంగారమే..!

జ్యోతిష్యం:  గ్రహాల రాజు సూర్యుడు నక్షత్రం మార్పు.. ఇక ఆ నాలుగు రాశులు వారు పట్టింది బంగారమే..!

వేద జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాలు ఎప్పటికప్పుడు తమ స్థానాలను మారుతుంటాయి.  ఇలా మారినప్పుడు   దాని ప్రభావం అన్ని రాశుల వారి జీవితాల పైన కనిపిస్తుంది.  గ్రహాలకు రాజు అయిన సూర్యుడు .. బుధ గ్రహానికి చెందిన  రేవతి నక్షత్రంలోకి  2026 మార్చి 31 రాత్రి 8.16 గంటలకు ప్రవేశించనున్నాడు.  అదే నక్షత్రంలో ఏప్రిల్​ 14 వ తేది ఉదయం 09:38 వరకు అదే నక్షత్రంలో  కొనసాగనున్నాడు. సూర్యుడి నక్షత్రం మార్పు వలన  నాలుగు రాశుల  ( మేషం, సింహం, ధనస్సు, మకరం)  వారి  జీవితంలో సానుకూలమైన ఫలితాల కలుగుతాయని పండితులు చెబుతున్నారు.  ఇప్పుడు ఆ రాశుల గురించి తెలుసుకుందాం.  .

మేషరాశి : గ్రహాలకు రాజు అయిన సూర్యుడు  నక్షత్రం మార్పు వలన  ఈ రాశి వారికి గ్రహబలం పెరుగుతుంది. వృత్తి.. ఉద్యోగాల రీత్యా విదేశాల్లో స్థిరపడే అవకాశం ఉంది.  కొద్ది ప్రయత్నంతో అత్యధికంగా లాభం పొందడం జరుగుతుంది. సమాజంలో  ప్రముఖులతో  సంబంధాలు ఏర్పడతాయి. ఆదాయం ఇబ్బడిముబ్బడిగా పెరుగుతుందని పండితులు చెబుతున్నారు.వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో యాక్టివిటీ పెరుగుతుంది.  నిరుద్యోగులకు ఆశించిన జాబ్​ వస్తుంది. ఉద్యోగంలో ఉన్నత పదవులు లభిస్తాయి. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు అంచనాలను మించే అవకాశం ఉంది. పూర్వీకుల ఆస్తి కలసి వస్తుంది..పెళ్లికోసం ఎదురు చూసేవారికి ఉన్నత కుటుంబంలో వారితో సంబందం కుదురుతుంది. వృత్తి, వ్యాపారాల్లో తీరిక లేని పరిస్థితి ఏర్పడుతుంది. ఆరోగ్య విషయంలో ఎలాంటి ఇబ్బందులు ఉండవని జ్యోతిష్య పండితులు  చెబుతున్నారు.

సింహరాశి: సూర్యుడు నక్షత్రం మార్పు ఈ రాశి వారికి చాలా శుభప్రదమని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.  ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఉద్యోగంలో ప్రమోషన్ లేదా వేతనం పెరిగే అవకాశాలున్నాయి. . వృత్తి.. ఉద్యోగాల రీత్యా విదేశాల్లో స్థిరపడే అవకాశం ఉంది.  కొద్ది ప్రయత్నంతో అత్యధికంగా లాభం పొందడం జరుగుతుంది. సమాజంలో  ప్రముఖులతో  సంబంధాలు ఏర్పడతాయి. ఆదాయం ఇబ్బడిముబ్బడిగా పెరుగుతుందని పండితులు చెబుతున్నారు. .వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో యాక్టివిటీ పెరుగుతుంది.  నిరుద్యోగులకు ఆశించిన జాబ్​ వస్తుంది.పెళ్లికోసం ఎదురు చూసేవారికి ఉన్నత కుటుంబంలో వారితో సంబందం కుదురుతుంది. 

ధనస్సు రాశి :  సూర్యుని నక్షత్రంలో  మార్పు ఈ రాశి వారికి చాలా  ప్రయోజనకరంగా ఉండవచ్చని పండితులు చెబుతున్నారు. మీరు తీసుకొనే నిర్ణయాలతో చేపట్టిన ప్రతి పని విజయం చేకూరుతుంది కొత్త ఆదాయ మార్గాలు ఏర్పడుతాయి.  గతంలో పెట్టిన పెట్టుబడులకు ఇప్పుడు లాభాలు కలుగుతాయి.  ఆర్థిక పరంగా చాలా ప్రయోజనాలు కలిగే అవకాశం ఉంది. మనసులోని కోరికలు చాలావరకు నెరవేరుతాయి. ఉద్యోగంలో జీతభత్యాలు పెరగడంతో పాటు అదనపు ఆదాయ ప్రయత్నాలు ఫలిస్తాయి. చేతి వృత్తుల వారికి  ఆశించిన దానికంటే ఎక్కువ ఆర్డర్లు వస్తాయి.  వ్యాపారాలు లాభాల బాటపడతాయి.  సంతాన యోగం కలుగుతుంది. నిరుద్యోగులు జాబ్​  ఆఫర్​  లెటర్స్​ అందుకుంటారు. ప్రేమ.. పెళ్లి వ్యవహారాలు కలిసి వస్తాయి. 

►ALSO READ | ఆధ్యాత్మికం: హనుమజ్జయంతి పూజ.. గ్రహ బాధలకు పరిష్కారం.. ఆరోజు చేయాల్సింది ఇదే..!

మకర రాశి :  ఈ రాశి వారికి సూర్యగ్రహం నక్షత్రం మార్పు వలన  పురోగతికి మార్గాలు తెరుచుకుంటాయి.  కష్టానికి తగిన ప్రతిఫలాన్ని మీరు పొందుతారు. చాలా కాలంగా అప్పుల్లో లేదా పెట్టుబడి పెట్టిన డబ్బులో చిక్కుకున్న వారికి త్వరలో ఉపశమనం లభిస్తుంది. పాత బకాయిలు వసూలవుతాయి. అదృష్టం మీ తలుపు తట్టే అవకాశం ఉంది. ఎన్నడూ చూడని  ఆర్థిక లాభాలు ఉంటాయి.  ముఖ్యమైన ఆర్థిక అవసరాలు తీరిపోవడంతో పాటు ఆర్థిక, వ్యక్తిగత సమస్యలు పూర్తిగా పరిష్కారమవుతాయి. ఉద్యోగంలో జీతభత్యాలు, వృత్తి, వ్యాపారాల్లో రాబడి బాగా వృద్ధి చెందు తాయి. 

Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనాన్ని జ్యోతిష్య నిపుణుల సలహాలతో పాటు ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించరు. మీకున్న  జ్యోతిష్య సమస్యలకు నిపుణులను సంప్రదించటం ఉత్తమం.