IPL 2026: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచులో పంజాబ్ కింగ్స్ బౌలర్లు చెలరేగారు. దీంతో నిర్ణీయ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి గుజరాత్ 162 పరుగులు మాత్రమే చేసింది. కాగా ముల్లన్‌పూర్‌లోని మహారాజా యాదవీంద్ర సింగ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరుగుతున్న ఈ పోరులో పంజాబ్ కింగ్స్ బౌలర్లు యజ్వేంద్ర చాహల్, విజయకుమార్ వైశాఖ్, మార్కో జాన్సెన్ అద్భుతమైన బంతులు చేయడంతో పరుగులు చేసేందుకు గుజరాత్ టైటాన్స్ చెమడోడ్చింది.
అంతకుముందు టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్ ముందు బౌలింగ్ తీసుకుంది. దీంతో తొలుత బ్యాటింగ్ కి వచ్చిన గుజరాత్ టైటాన్స్ మొదటి రెండు ఓవర్లలో భారీగా పరుగులు రాబట్టిన ఆ తర్వాత రన్స్ చేయడం కోసం తీవ్రంగా శ్రమించారు. నాలుగో ఓవర్లలో 37 పరుగుల వద్ద పంజాబ్ కి తొలి బ్రేక్ త్రూ లభించింది. మార్కో జాన్సెన్ బౌలింగ్ లో సాయి సుదర్శన్ భారీ షాట్ ఆడబోయి పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ కు చేరుకున్నాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన జోస్ బట్లర్ ఆచితూచీ బ్యాటింగ్ చేస్తు గిల్ కి సహాకారం అందించాడు.. కానీ 9వ ఓవర్ వేసిన యజ్వేంద్ర చాహల్ బౌలింగ్ లో కూపర్ కి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో 76 పరుగులకే కీలకమైన వికెట్లను గుజరాత్ కోల్పోయింది.
శుభ్‌మన్ గిల్ ఔట్ అయిన తర్వాత క్రీజులోకి వచ్చిన గ్లెన్ ఫిలిప్స్ వచ్చి రావడంతో బ్యాట్ ఝలిపించే ప్రయత్నం చేశాడు. ఒక సిక్సు, ఒక ఫోర్ కొట్టిన ఫిలిప్స్ (25) తర్వాత విజయకుమార్ వైశాఖ్ బౌలింగ్ లో భారీ షాట్ ఆడబోయి యాన్సన్ కి క్యాచ్ ఇచ్చి ఔట్ కాసేపటికే జోస్ బట్లర్ (38) కూడా అతడి బౌలింగ్ లోనే డగౌట్ కి వెళ్లిపోయాడు. ఆ తర్వాత బ్యాటింగ్ కి వచ్చిన వాషింగ్టన్ సుందర్ (18), షారుక్ ఖాన్ (4) విఫలం కావడంతో గుజరాత్ కేవలం 20 ఓవర్లలో 162 పరుగులు మాత్రమే చేసింది. ఇక పంజాబ్ కింగ్స్ బౌలర్లలో విజయకుమార్ వైశాఖ్ మూడు వికెట్లు తీసుకోగా, యజ్వేంద్ర చాహల్ రెండు వికెట్లు పడగొట్టి, మార్కో జాన్సెన్ ఒక వికెట్ తీసుకుని గుజరాత్ పరుగులు ప్రవాహాన్ని కట్టడి చేయగా.. అర్ష్ దీప్ సింగ్ మాత్రం ఈ మ్యాచులో ధారళంగా పరుగులు సమర్పించుకుని విఫలమయ్యాడు.
Timing of that jump! 🔥pic.twitter.com/bRdGcbxTPM
— Punjab Kings (@PunjabKingsIPL) March 31, 2026
