పాపం చికెన్ లవర్స్.. తెలంగాణలో మరికొన్ని గంటల్లో చికెన్ షాపులు బంద్.. హోటల్స్, రెస్టారెంట్లలో కూడా దొరకదా..?

పాపం చికెన్ లవర్స్.. తెలంగాణలో మరికొన్ని గంటల్లో చికెన్ షాపులు బంద్.. హోటల్స్, రెస్టారెంట్లలో కూడా దొరకదా..?

హైదరాబాద్: 2026లో ఇంకెప్పుడు అయిపోతుందిరా బాబూ అని ఎదురుచూసిన మార్చి నెల మరికొన్ని గంటల్లో కాల గర్భంలో కలిసిపోతుంది. మార్చి పోతే ఏప్రిల్ రావడం ఎప్పుడూ జరిగేదే. కానీ.. తెలంగాణలో మాత్రం ఏప్రిల్ 1 నుంచి చికెన్ షాపులు మూసేయాలని చికెన్​షాప్​ఓనర్స్ అసోసియేషన్ తీసుకున్న నిర్ణయాన్ని మాత్రం నాన్ వెజ్ ప్రియులు జీర్ణించుకోలేకపోతున్నారు. చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ అని, చికెన్ దమ్ బిర్యానీ అని వండుకోవడం కుదరకపోయినా ఆర్డర్లు పెట్టుకుని మరీ తినే నాన్ వెజ్ లవర్స్ ఏప్రిల్ 1 వస్తుందంటేనే చికెన్ దొరకదేమోననే టెన్షన్లో ఉన్నారు. 

చికెన్ సెంటర్లతో పాటు హోటల్స్, రెస్టారెంట్స్లో కూడా చికెన్ ఐటమ్స్ దొరకవేమోనని కంగారు పడుతున్నారు. పోనీ.. చికెన్ దొరక్కపోతే మటన్ తిందాంలే అనుకునే పరిస్థితి లేదు. ఎందుకంటే.. మటన్ రేట్లు మంటెత్తిస్తున్నాయి. ఈ క్రమంలో.. తెలంగాణలో మరీ ముఖ్యంగా.. హైదరాబాద్ సిటీలో చికెన్ ప్రియులు ముక్క దొరకదనే నిరాశలో కూరుకుపోయారు.

అసలు.. ఈ చికెన్ షాప్స్ మూసేయాలనే నిర్ణయానికి రావడం వెనుక కారణాలేంటంటే.. తమకు మార్జిన్ సరిపోవడం లేదని, షాప్ రెంట్, కూలీల జీతాలు, కరెంట్ బిల్లు, నీటి ఖర్చులు, అమ్ముడుపోని చికెన్ వల్ల నష్టపోతున్నామనేది చికెన్​షాప్​ఓనర్స్ వాదన. గతంలో కిలో చికెన్​కు రూ.30 నుంచి రూ. 35 వరకు మిగిలేదని.. ఇప్పుడు చికెన్​రేటు పెరిగినా రూ.6 మాత్రమే మిగులుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పౌల్ట్రీ కంపెనీలే లాభపడుతున్నాయని, మార్జిన్ పెంచి ఆదుకోవాలని ఓనర్స్​కోరుతున్నారు. 

►ALSO READ | హైదరాబాద్ కొత్తగూడ శ్మశానవాటిక దగ్గర ఉద్రిక్తత.. రోడ్డు విస్తరణపై స్థానికుల ఆందోళన..

ఫీడ్ ధరలు పెరగడం, మెడిసిన్, ట్రాన్స్ పోర్ట్, కోళ్ల మరణాలతో లైవ్​చికెన్ ​రేట్లు పెంచక తప్పడం లేదనేది పౌల్ట్రీ కంపెనీల వాదన. ఇలా.. చికెన్ సెంటర్ల ఓనర్లకు, పౌల్ట్రీ కంపెనీలకు మధ్య లెక్క సరిపోకపోవడం వల్ల చికెన్ షాపులు మూతపడక తప్పని పరిస్థితి వచ్చింది. చికెన్ షాపులు మూత పడితే హోటల్ రంగం, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లపై తీవ్ర ప్రభావం పడనుంది.

చికెన్​ షాప్​ ఓనర్స్ పెంచాలని డిమాండ్ చేస్తున్న ఈ మార్జిన్ అంటే ఏంటంటే..
‘మార్జిన్’అంటే కిలో చికెన్ అమ్మినప్పుడు మిగిలే లాభం. కొనుగోలు, అమ్మకపు ధరల మధ్య తేడా కాకుండా మధ్యలో వచ్చే ఖర్చులు తీసేసిన తర్వాత మిగిలేది. ఉదాహరణకు.. షాప్ ఓనర్ లైవ్ చికెన్‌‌ను కిలో రూ.120 కి కొన్నాడనుకుందాం. దాన్ని కట్ చేసి అమ్మేటప్పుడు వేస్టేజీ తీసేస్తారు. దీంతో కిలో లైవ్​ కోడి నుంచి 700 నుంచి 750 గ్రాముల చికెన్​ అవుతుంది. దీంతో కిలో చికెన్ ​రూ.150 నుంచి రూ. 160 వరకు పెరుగుతుంది. కస్టమర్‌‌కు రూ.200కు అమ్మితే రూ.40 మార్జిన్ ఉన్నట్టు కనిపించినా, అది పూర్తిగా లాభం కాదు.

రిటైల్ చికెన్ షాపుల్లో రెంట్, కూలీల జీతాలు, కరెంట్ బిల్లు, వాటర్ ఖర్చులు, అమ్ముడుపోని చికెన్ ..ఇవన్నీ తీసేస్తే కిలోకి రూ.5 నుంచి రూ. 6 మాత్రమే మిగులుతోందని చికెన్ షాప్ ఓనర్స్ చెప్తున్నారు. హైదరాబాద్ సిటీలోనే 8 వేల నుంచి 10 వేల వరకు చికెన్ షాపులున్నాయి. రిటైల్ దుకాణాల నుంచి పెద్ద మార్కెట్ యూనిట్ల వరకు ఈ వ్యాపారం విస్తరించింది. ఈ బిజినెస్​పై ఆధారపడి లక్షల మంది బతుకుతున్నారు. అలాంటి చికెన్ షాపులు మూతపడితే పరిస్థితులు దారుణంగా మారే అవకాశం ఉంది.