ఇరాన్ పై అమెరికా తన దాడులను తీవ్రతరం చేస్తూ పోతోంటే బంగారం, వెండి రేట్లు భారీగా అనిశ్చితికి గురవుతున్నాయి. దాదాపు గడచిన నెల రోజులుగా పెద్దగా పెరగని ఈ లోహాలు కొద్దిగా పెరుగుతూ తగ్గుతూ దాదాపు అదే స్థాయిల వద్ద కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో ఆభరణాలు షాపింగ్ చేయాలనుకుంటున్న రిటైల్ ఇన్వెస్టర్లు తాజా రేట్లను పరిశీలించటం ముఖ్యం.
మార్చి 31న బంగారం రేట్లు స్వల్పంగా పెరిగాయి. మార్చి 30 కంటే గ్రాముకు 24 క్యారెట్ల బంగారం రేటు గ్రాముకు రూ.103 పెరుగుదలను నమోదు చేసింది. దీంతో హైదరాబాద్, వరంగల్, నిజాంబాద్, ఖమ్మం, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కడప నగరాల్లో స్వచ్చమైన బంగారం రేటు రూ.14వేల 929గా కొనసాగుతోంది. ఈ నగరాల్లో 22 క్యారెట్ల బంగారం రేటు గ్రాముకు రూ.13వేల 685గా కొనసాగుతోంది.
మంగళవారం రోజున వెండి రేట్ల విషయానికి వస్తే.. మార్చి 31, 2026న దేశవ్యాప్తంగా కేజీకి రూ.5వేలు పెరిగింది. అయితే రెండు రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, వరంగల్, నిజాంబాద్, ఖమ్మం, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కడపలో కేజీ స్వచ్ఛమైన వెండి రేటు రూ.2లక్షల 50వేల వద్ద స్థిరంగా ఎలాంటి మార్పు లేకుండా కొనసాగుతోంది. అంటే గ్రాము ధర రూ.250గా ఉంది.
