PAYTM ఉద్యోగికి కరోనా వైరస్

PAYTM ఉద్యోగికి కరోనా వైరస్

పేటీఎమ్ ఉద్యోగికి కరోనా వైరస్ పాజిటీవ్ వచ్చినట్లు ఆసంస్థ ప్రతినిధులు చెప్పారు. పేటీఎమ్ కు చెందిన ఓ ఉద్యోగి ఈ మధ్య ఇటలీకి వెళ్లి వచ్చినట్లు తెలిపారు. అయితే అతనికి ఈరోజు కరోనా  టెస్ట్ చేయించుకోగా రిపోర్ట్ పాజిటీవ్ గా వచ్చింది. సదరు ఉద్యోగి గుర్ గావ్ కు చెందిన వ్యక్తిగా తెలిపారు. అయితే ఆ వ్యక్తి యొక్క టీం మెంబర్స్ అందరికీ కరోనా టెస్ట్ చేయిస్తున్నట్లు తెలిపారు పేటీఎమ్ అధికారులు. ఇప్పటి వరకు దేశంలో 28కరోనా కేసులు నమోదయ్యాయి.