వృషభంలోకి శుక్రుడు.. 12 ఏళ్లకు కొన్ని రాశుల వారికి గజలక్మి రాజయోగం...

వృషభంలోకి శుక్రుడు.. 12 ఏళ్లకు కొన్ని రాశుల వారికి గజలక్మి రాజయోగం...

జ్యోతిషశాస్త్రంలో శుక్రుడు ప్రేమ, అందం, లగ్జరీ, సృజనాత్మకత, సంపద, శ్రేయస్సు, వైవాహిక ఆనందానికి కారకంగా పరిగణించబడుతున్నాడు. శుక్ర గ్రహం  రాక్షసుల గురువుగా కూడా పరిగణించబడుతున్నాడు. మే 19 ఉదయం 08:51 గంటలకు శుక్రగ్రహం తన రాశిని మార్చుకున్నాడు. మేషరాశిని వీడిన.. శుక్రుడు వృషభరాశిలోకి ప్రవేశించాడు. ఇక ఈ నెలాఖరున బుధుడు కూడా వృషభరాశిలోకి ప్రవేశిస్తుండగా 12 ఏళ్ల తర్వాత  కొన్ని రాసుల గజలక్ష్మి రాజయోగం ఏర్పడింది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారంగా  శుక్ర గ్రహం వృషభరాశిలోకి మారడం వలన  ఏరాశి వారికి ఎలా ఉంటుందో తెలుసుకుందాం. . .. 

గ్రహాల కదలిక మన జీవితాలపై ప్రభావాన్ని చూపుతుంది. గ్రహాలు కాలానుగుణంగా అన్ని రాశులలోకి సంచరిస్తూ ఉంటారు. ఈ సంచార సమయంలో ప్రజల జీవితంలో అనేక రకాల ప్రభావాలను చూపిస్తాయి.  జ్యోతిషశాస్త్రంలో శుక్రుడు ప్రేమ, అందం, లగ్జరీ, సృజనాత్మకత, సంపద, శ్రేయస్సు, వైవాహిక ఆనందానికి కారకంగా పరిగణించబడుతున్నాడు. శుక్ర గ్రహం  రాక్షసుల గురువుగా కూడా పరిగణించబడుతున్నాడు.  అయితే ఎవరి జాతకంలో శుక్రుడు బలంగా ఉంటాడో ఆ వ్యక్తులు ప్రేమలో విజయం సాధిస్తారు.

మేషరాశి: వృషభరాశిలో శుక్ర గ్రహం సంచారం వలన మేషరాశి వారికి చాలా శుభప్రదంగా ఉంటుంది.  వృత్తి, వ్యాపారంలో అనుకోకుండా లాభాలు చేకూరతాయి. ఉద్యోగస్తులకు ప్రమోషన్​ వచ్చే అవకాశం ఉంది. ప్రేమ, వైవాహిక జీవితం చాలా సంతోషంగా ఉంటుంది.  గతంలో రావలసిన బకాయిలు వసూలవుతాయి.  అయితే ఆరోగ్య విషయంలో కొన్ని జాగ్రత్తలు పాటించాలని జ్యోతిష్య నిపుణులు సూచిస్తున్నారు. 

వృషభ రాశి : వృషభరాశిలో శుక్రుడు సంచరించడం వల్ల ఈ రాశి వారికి విశేష లాభం చేకూరుతుంది. ఈ రాశుల వారికి శుక్రుని సంచారము లాటరీ లాగా పరిగణించబడుతోంది. వృషభ రాశి వారికి సంపద అనేక రెట్లు పెరుగుతుంది. అనేక కొత్త ఆదాయ మార్గాలు అందుబాటులోకి రానున్నాయి. కెరీర్‌లో ఎన్నో కొత్త అవకాశాలు వస్తాయి.

మిథున రాశి:  శుక్ర రాశి  స్థానం మారడం వలన మిథున రాశి వారు కొంత సంయమనం పాటించాలి. వృత్తి, విద్య, ఆర్థిక విషయాల్లో ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి.  అనవసర ఖర్చులు పెరుగుతాయి. ఎవరితోకూడా వాదనలు పెట్టుకోవద్దు. ఎక్కువ సమయం దైవ ప్రార్థనలో గడపండి.  కొన్ని సమస్యలకు కాలమే పరిష్కారం చూపుతుంది.  కొత్త పనులు ప్రారంభించేటప్పుడు  పెద్దల సలహాలు తీసుకోండి.

కర్కాటక రాశి : ఈ రాశికి చెందిన వ్యక్తులకు శుక్ర గ్రహం విజయానికి కొత్త ఆశను తీసుకొస్తుంది. ఎందుకంటే శుక్రుడు కర్కాటక రాశికి అధినేత అయినందున లాభస్థానంలో సంచరించనున్నాడు. దీని వల్ల కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం నెలకొని పెద్దల అభిమానాన్ని పొందుతారు. వ్యాపారంలో కూడా గొప్ప విజయం సాధించవచ్చు.

సింహ రాశి : వృషభరాశిలో శుక్ర గ్రహం సంచరించడంతో సింహరాశి వారికి గజలక్షి యోగం ఏర్పడుతుందని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు.  ఈ రాశి వారు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న ఉద్యోగం లభిస్తుంది. ప్రస్తుతం చేస్తున్న వృత్తిలో స్థాన చలనంతో పాటు ప్రమోషన్​ వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి. జాయింట్​ వ్యాపారాలు కలసి వస్తాయి. ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న పనులు పూర్తి అవుతాయి. 

కన్య రాశి : శుక్రుని సంచారం కన్యా రాశికి చెందిన వ్యక్తుల ప్రేమ సంబంధాలను మెరుగుపరుస్తుంది. వైవాహిక జీవితంలో భార్యాభర్తల మధ్య ఆనందం, నమ్మకం పెరుగుతుంది. పాత అప్పులు, ఎప్పటి నుంచో రాకుండా ఇబ్బంది పెడుతున్న డబ్బు తిరిగి పొందడం ఆనందంగా ఉంటుంది. వ్యాపారం మెరుగుపడుతుంది.

తుల రాశి: తులారాశికి ఎనిమిదవ రాశిలో శుక్రుడు సంచరించడం వల్ల వైవాహిక జీవితంలో ఎదురయ్యే  వివాదాలు పరిష్కారమయ్యే అవకాశం ఉంది. ప్రేమ సంబంధాలలో సామరస్యం, సాన్నిహిత్యం పెరుగుతుంది. కుటుంబ సమస్యలు పరిష్కారమవుతాయి. ఆదాయం ఊహించిన దాని కంటే పెరుగుతుంది.  కుటుంబంతో సెలవులకు ఎక్కడికైనా వెళ్లే ప్రయత్నం చేస్తారు.

వృశ్చిక రాశి : ఈ రాశికి సప్తమంలో శుక్రుడు సంచరించడం వల్ల వైవాహిక జీవితంలో కొంత విషాదం నెలకొనే అవకాశం ఉంది. అక్రమ సంబంధాల సంకేతాలు ఉన్నాయి. అయితే వృత్తి, వ్యాపారాలలో చాలా అద్భుతమైన అవకాశాలు ఉంటాయి.

ధనుస్సు రాశి: శుక్రుడు వృషభంలో సంచారం వలప ధనస్సు రాశి వారికి మిశ్రమ ఫలితాలుంటాయి. కుటుంబ జీవితం సాఫీగా సాగుతుంది... కోర్టు వివాదాలు.. ఎప్పటినుంచి ఎదర్కొంటున్న సమస్యలు పరిష్కారమవుతాయి. వ్యాపారంలో అధిక లాభాలు గడిస్తారు. వృత్తి విషయంలో శ్రమ పడాల్సి వస్తుంది.  శ్రమకు తగిన ఫలితం ఉంటుంది. విద్యార్థులు అనుకున్న ఫలితాలు సాధిస్తారు. ఆర్ధిక విషయంలో గతంలో కంటె పరిస్థితి  మెరుగుపడుతుంది. ప్రేమ విషయాలు అనుకూలిస్తాయి. 

మకర రాశి: వృషభ రాశిలోకి శుక్రుడు మారడం వలన  మకర రాశి వారికి అనుకోకుండా ఆర్థిక లాభం చేకూరుతుంది. ఉద్యోగులకు అనుకోకుండా ప్రమోషన్​ వస్తుంది.  పై అధికారులు ప్రశంసలు వస్తాయి. ఉద్యోగం కోసం ఎదురు చూసే వారు శుభవార్త వింటారు. విదేశీ ప్రయాణాలు కలసివస్తాయి. ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్తలు పాటించాలి.

కుంభ రాశి: శుక్రుడు .. వృషభ రాశిలో మారడం వలన కుంభ రాశి వారి జీవితంలో చాలా సానుకూల మార్పులు కలిసి వస్తాయి.  ఈ రాశి వారు ఎప్పటి నుంచో ఎదురు చేస్తున్న గోల్డెన్​ టైం ఆసన్నమైంది. ఉద్యోగస్తులకు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ప్రమోషన్​ను అందుకుంటారు. మీరు చేస్తున్న వృత్తిలో చాలా  మంచి పేరు తెచ్చుకునే సమయం వచ్చింది. ఆర్థికంగా పురోగతి ఉంటుంది. ఎలాంటి ఇబ్బందులు లేకుండా జీవితం సాఫీగా కొనసాగుతుంది. ఈ రాశి వారికి  గజలక్మి యోగంతో పాటు  రాజయోగం కూడా వచ్చే అవకాశం ఉంది.

మీన రాశి: మీనరాశికి శుక్రుని సంచారం కొంత మిశ్రమ ఫలితాలను తెస్తుంది. మీన రాశికి చెందిన వ్యక్తులు తమ మాటను నియంత్రించుకోవాల్సి ఉంటుంది, లేకపోతే వివాదాలు ఏర్పడవచ్చు. ప్రేమ సంబంధాలలో విజయం పొందుతారు. పనికి సంబంధించిన రాబడి ఉంటుంది.