అబిడ్స్లో ఘరానా మోసం.. అధిక వడ్డీ ఆశచూపి రూ.200 కోట్లు టోకరా

అబిడ్స్లో ఘరానా మోసం.. అధిక వడ్డీ  ఆశచూపి రూ.200 కోట్లు టోకరా

అధిక వడ్డీ ఆశ చూపి రూ.200 కోట్లతో ఉడాయించిన ఘటన హైదరాబాద్ లోని అబిడ్స్ లో జరిగింది.  అబిడ్స్ లోని శ్రీ ప్రియాంక ఎంటర్ ప్రైజెస్ డిపాజిట్ ల రూపంలో డబ్బులు తీసుకొని అధిక వడ్డీలు ఇస్తామని నమ్మబలికి 517 మంది దగ్గరి నుంచి దాదాపు రూ.200 కోట్లు వసూలు చేసి జెండా ఎత్తేసింది.

దీంతో  బాధితులు బషీర్ బాగ్ లోని హైదరాబాద్ సీసీఎస్ పోలీసు స్టేషన్ ముందు ఆందోళనకు దిగారు.  తమకు న్యాయం చేయాలంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు.  అబిడ్స్ లోని తెలంగాణ స్టేట్ కోఆపారేటివ్ బ్యాంక్ లో జనరల్ మేనేజర్ గా  పనిచేస్తున్న నిమ్మగడ్డ వాని బాల,తన భర్త మేక నేతాజీ, కొడుకు మేక శ్రీహర్షలు తమని మోసం చేసారని ఫిర్యాదులో తెలిపారు. 

బ్యాంక్ లో  డిపాజిట్ చేయడానికి వచ్చే   వినియోగదారులను ఆకర్షించి వారికి అధిక వడ్డీ ఆశచూపి అదే బ్యాంక్ సమీపంలోని తన భర్త  ఆఫీస్ ప్రియాంక ఎంటర్ ప్రైజెస్ లో  నిమ్మగడ్డ వాని బాల డిపాజిట్ చేయించుకున్నట్లు ఆరోపించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.