Sivaji Vs Anasuya: "అతి వినయం ధూర్త లక్షణం".. శివాజీ క్షమాపణలపై అనసూయ నిప్పులు!

Sivaji Vs Anasuya: "అతి వినయం ధూర్త లక్షణం".. శివాజీ క్షమాపణలపై అనసూయ నిప్పులు!

టాలీవుడ్ సీనియర్ నటుడు శివాజీ ఇటీవల 'దండోరా' సినిమా ఈవెంట్‌లో హీరోయిన్ల వస్త్రధారణపై చేసిన వ్యాఖ్యలు పెను దుమారాన్నే రేపుతున్నాయి.. ఈ వ్యాఖ్యలపై సినీ సెలబ్రిటీలు సీరియస్ అయ్యారు. మహిళా కమిషన్ కూడా నోటీసులు పంపించింది. మరోపక్క సోషల్ మీడియాలో ట్రోలింగ్ ఎదురవడంతో శివాజీ వివరణ ఇచ్చారు. అయితే, ఇదే సమయంలో నటి అనసూయ చేసిన కామెంట్స్ ఈ మంటకు మరింత ఆజ్యం పోశాయి.

క్షమాపణలు చెప్పినా తగ్గని శివాజీ!

శివాజీ ప్రెస్ మీట్ పెట్టి  తన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చారు. ప్రవాహంలో నాకు తెలియకుండానే ఆ రెండు 'అన్-పార్లమెంటరీ' పదాలు దొర్లాయి. ఆ మాటలకు గాను తెలుగు ఆడపడుచులందరికీ చేతులెత్తి క్షమాపణలు చెబుతున్నాను. నేను తప్పు చేస్తే సారీ చెప్పడానికి భయపడను. ఇప్పటికే నా భార్యకు, కుటుంబానికి కూడా సారీ చెప్పాను అని అన్నారు. అయితే, తన ఉద్దేశం మాత్రం తప్పు కాదని, పబ్లిక్ ప్లేసులలో హీరోయిన్లు ఇబ్బంది పడకూడదనే ఆవేదనతోనే అలా మాట్లాడానని తన పాత స్టేట్‌మెంట్‌కు కట్టుబడి ఉన్నానని స్పష్టం చేశారు.

అనసూయకు సూటి ప్రశ్న..

ఈ వివాదంలోకి వచ్చిన నటి అనసూయను ఉద్దేశించి శివాజీ ఘాటుగా స్పందించారు. అనసూయ గారు.. మీరు ఇందులో ఎందుకు ప్రవేశించారు? నేను మిమ్మల్ని ఏమైనా అన్నానా? నన్ను దోషిగా నిలబెట్టాలని చూస్తున్న వారికి నా వందనాలు. గతంలో ఎన్నో దారుణాలు జరిగినప్పుడు స్పందించని వారు, ఇప్పుడు ఎందుకు నన్ను టార్గెట్ చేస్తున్నారు? అని ప్రశ్నించారు. . నా మీద జాలి చూపించిన మీ విశాల హృదయానికి చాలా థ్యాంక్స్. దేవుడు మీకు అంతటి విశాల హృదయాన్ని ఇచ్చినందుకు ధన్యవాదాలు. త్వరలోనే మీ రుణం తీర్చుకునే అవకాశం కూడా నాకు వస్తుందని ఆశిస్తున్నా అంటూ కౌంటర్ ఇచ్చారు.

►ALSO READ | Karate Kalyani: "నా శరీరం నా ఇష్టం అంటే కుదరదు".. నటి అనసూయకు కరాటే కళ్యాణి కౌంటర్!

బట్టల గురించి మాట్లాడటం చేతగానితనం..

శివాజీ వివరణపై అనసూయ అత్యంత ఘాటుగా స్పందించారు. శివాజీ ప్రవర్తనను తప్పుబడుతూ ఆమె చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. సోషల్ మీడియా వేదికగా మాట్లాడుతూ..  అతి వినయం ధూర్త లక్షణం అంటూ ఫైర్ అయ్యారు. శివాజీ  ప్రెస్ మీట్‌లో క్షమాపణలు చెబుతూనే మళ్ళీ తన పాత మాటలకే కట్టుబడి ఉండటాన్ని అనసూయ తప్పుబట్టారు.  శివాజీ గారు చాలా ఇన్సెక్యూర్ గా ఉన్నారని, ఆయన్ని చూస్తుంటే తనకు జాలి వేస్తోందని అన్నారు. ఎవరైనా ఆడపిల్లలు వేసుకునే బట్టల గురించి మాట్లాడుతున్నారంటే అది వారి చేతగానితనమే అని, తమ కళ్లపై తమకు నియంత్రణ లేక ఎదుటివారిని తప్పుబడుతున్నారని విమర్శించారు.

మగవారికి చెప్పండి..

 హీరోయిన్లుగా మా బాధ్యతలు ఏంటో, మా హక్కులు ఏంటో మాకు తెలుసు. మాకు డ్రెస్సింగ్ గురించి ఎవరూ పాఠాలు చెప్పాల్సిన అవసరం లేదని అనసూయ స్పష్టం చేశారు.  నిజంగా మీకు సమాజం మీద అంత శ్రద్ధ ఉంటే, ఆడవారికి నీతులు చెప్పడం ఆపి మగవారికి బుద్ధి చెప్పండి అని సవాల్ విసిరారు.   రీల్ కి రియల్ కి తేడా తెలుసుకోమని సూచించారు. తనపై  సోషల్ మీడియాలో అసభ్యకరంగా కామెంట్స్ చేసే వారిపై కచ్చితంగా చట్టపరమైన చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు.  ప్రస్తుతం ఈ వివాదం కేవలం మాటలకే పరిమితం కాకుండా మహిళా కమిషన్ వరకు వెళ్లడంతో, ముందు ముందు ఈ 'వార్' ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి.