క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా వెండితెరపై అలరించే నటి ప్రగతి.. ఇప్పుడు క్రీడా రంగంలోనూ భారత్ సత్తాను ప్రపంచానికి చాటిచెప్పారు. టర్కీ వేదికగా జరిగిన ఏషియన్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్‌షిప్‌లో ప్రగతి అద్భుత ప్రదర్శన కనబరిచారు. ఒక బంగారు పతకం (Gold Medal) ,మూడు రజత పతకాలు (Silver Medals) సాధించి అందరినీ ఆశ్చర్యపరిచారు. అయితే, ఈ విజయం తర్వాత సోషల్ మీడియాలో ఒక వింత చర్చ మొదలైంది.
పూజల వల్ల పతకాలు వచ్చాయా?
ప్రగతి ఈ పతకాలు సాధించడానికి ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామి చేసిన పూజలే కారణమని నెట్టింట వార్తలు గుప్పుమన్నాయి. గతంలో ప్రగతి ఆయనతో కలిసి పూజలు నిర్వహిస్తున్న వీడియోలు, ఫోటోలు మళ్ళీ వైరల్ కావడంతో.. వేణుస్వామి మహిమ వల్లే ప్రగతికి ఈ గుర్తింపు వచ్చిందని కొందరు కామెంట్స్ చేశారు. వేణుస్వామి కూడా ఈ విజయంలో తన పూజల పాత్ర ఉందన్నట్లుగా సంకేతాలు ఇవ్వడంతో ప్రగతి రంగంలోకి దిగారు.
నా కష్టాన్ని తక్కువ చేయకండి..
ఈ వార్తలపై ప్రగతి స్పందిస్తూ.. "వేణుస్వామి పూజల వల్లే నాకు మెడల్స్ వచ్చాయన్న వార్తల్లో అసలు నిజం లేదు. సుమారు రెండేళ్ల క్రితం నేను మానసిక ఒత్తిడిలో ఉన్నప్పుడు, స్నేహితుల సలహా మేరకు ఆయన వద్దకు వెళ్ళాను. అప్పుడు ఏదో పూజలు చేశారు. కానీ ఆ పూజల వల్ల నాకేం పెద్దగా ఫలితం కనిపించలేదు. ఫలితం లేని ఆ పాత ఫోటోలను ఇప్పుడు మళ్ళీ వైరల్ చేయడం సరికాదు అని క్లారిటీ ఇచ్చారు.
►ALSO READ | Nidhhi Agerwal: 'తప్పు నాది కాదు.. మీ ఆలోచనది'.. శివాజీపై 'రాజా సాబ్' బ్యూటీ నిధి అగర్వాల్ సీరియస్!
ఆమె ఇంకా మాట్లాడుతూ.. నా పతకాల వెనుక నేనే కారణమని ఆయన చెప్పుకోవడం ఆయన సంస్కారానికే వదిలేస్తున్నాను. నేను రోజుకు గంటల తరబడి జిమ్‌లో పడ్డ కష్టం, నా క్రమశిక్షణ వల్లే ఈ పతకాలు వచ్చాయి తప్ప.. ఎవరో చేసిన పూజల వల్ల కాదు అని ఖరాఖండిగా చెప్పారు.
ఫిట్‌నెస్ ఐకాన్ గా ప్రగతి..
50 ఏళ్ల వయసులోనూ ప్రగతి చూపిస్తున్న ఫిట్‌నెస్ కుర్రకారుకు సైతం స్ఫూర్తినిస్తోంది. సినిమాల్లో బిజీగా ఉంటూనే, పవర్ లిఫ్టింగ్ లాంటి కఠినమైన క్రీడలో రాణించడం సామాన్యమైన విషయం కాదు. మూఢనమ్మకాల కంటే కష్టాన్ని నమ్ముకున్న ప్రగతిని ఇప్పుడు నెటిజన్లు కొనియాడుతున్నారు.
