Nidhhi Agerwal: 'తప్పు నాది కాదు.. మీ ఆలోచనది'.. శివాజీపై 'రాజా సాబ్' బ్యూటీ నిధి అగర్వాల్ సీరియస్!

Nidhhi Agerwal: 'తప్పు నాది కాదు.. మీ ఆలోచనది'.. శివాజీపై 'రాజా సాబ్' బ్యూటీ నిధి అగర్వాల్ సీరియస్!

టాలీవుడ్ సీనియర్ నటుడు శివాజీ 'వస్త్రధారణ' వివాదం ఇప్పుడే సద్దుమణిగేలా లేదు.  తాను చేసిన వ్యాఖ్యల వెనుక ఉన్న ఉద్దేశం మంచిదేనని, లులు మాల్‌లో నిధి అగర్వాల్ ఎదుర్కొన్న ఇబ్బందే తనను అలా మాట్లాడేలా చేసిందని శివాజీ సమర్థించుకున్నారు.  'అన్-పార్లమెంటరీ' పదాలకు క్షమాపణ చెప్పారు. అయితే, శివాజీ తన పేరును ఈ వివాదంలోకి లాగడంపై నిధి అగర్వాల్ అత్యంత ఘాటుగా స్పందించారు.

'మానిపులేషన్' పోస్ట్ వైరల్!

శివాజీ తనను ఉదాహరణగా చూపడంపై నిధి అగర్వాల్ సోషల్ మీడియా వేదికగా నిప్పులు చెరిగారు. బాధితురాలిదే తప్పని నిందించడం అత్యంత దారుణం. జరిగిన సంఘటనకు ఆ అమ్మాయిని బాధ్యురాలిని చేయడం అనేది ఒక రకమైన 'మానిపులేషన్' . ఇలాంటి ఆలోచనా ధోరణి మారాలి అంటూ ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో పోస్ట్ చేశారు. శివాజీ మాటలు తనను రక్షించేవిగా లేవని.. పైగా తననే దోషిగా నిలబెట్టేలా ఉన్నాయని ఆమె పరోక్షంగా చురకలు అంటించారు.

వివాదం నేపథ్యం ఏమిటి?

ఇటీవల 'దండోరా' మూవీ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో శివాజీ హీరోయిన్ల డ్రెస్సింగ్‌పై కొన్ని 'అన్-పార్లమెంటరీ' పదాలు వాడారు. హీరోయిన్లు పద్ధతిగా రావాలని, అంతా కనిపించేలా బట్టలు వేసుకోవడం వల్లే ఇబ్బందులు వస్తున్నాయని ఆయన కామెంట్ చేశారు. ఈ వ్యాఖ్యలపై ఇప్పటికే సింగర్ చిన్మయి, నటి అనసూయ భరద్వాజ్ విరుచుకుపడ్డారు. తెలంగాణ మహిళా కమిషన్ సైతం శివాజీకి నోటీసులు జారీ చేయడంతో ఈ వివాదం మరింత చర్చనీయాంశమైంది.

►ALSO READ | Sivaji Vs Anasuya: "అతి వినయం ధూర్త లక్షణం".. శివాజీ క్షమాపణలపై అనసూయ నిప్పులు!

క్షమాపణలు చెప్పినా తగ్గని సెగ..

మహిళా కమిషన్ నోటీసులు, సోషల్ మీడియా ట్రోలింగ్ నేపథ్యంలో శివాజీ మీడియా ముందుకు వచ్చారు. నేను వాడిన ఆ రెండు పదాలకు క్షమాపణలు చెబుతున్నాను. కానీ నా ఉద్దేశం మాత్రం కరెక్ట్. గతంలో లులు మాల్‌లో నిధి అగర్వాల్‌ బట్టల విషయంలో ఇబ్బంది పడినప్పుడు ఎవరైనా స్పందించారా? అలాంటివి జరగకూడదనే నేను అలా మాట్లాడాను అని వివరణ ఇచ్చారు. అయితే, ఎవరి కోసం మాట్లాడానని శివాజీ అన్నారో, ఆ నిధి అగర్వాలే ఇప్పుడు ఆయన మాటలను తిరస్కరించడం విశేషం.

కలకలం రేపుతున్న 'విక్టిమ్ బ్లేమింగ్'!

అనసూయ, చిన్మయి తర్వాత ఇప్పుడు నిధి అగర్వాల్ కూడా శివాజీకి వ్యతిరేకంగా నిలబడటంతో టాలీవుడ్‌లో ఆయన ఒంటరి అయ్యారు. ఒక మహిళకు ఇబ్బంది ఎదురైనప్పుడు ఆ వ్యక్తిని శిక్షించాలి తప్ప, ఆమె వేసుకున్న బట్టలను వేలెత్తి చూపడం విక్టిమ్ బ్లేమింగ్ అవుతుంది అని నెటిజన్లు కూడా నిధికి మద్దతు తెలుపుతున్నారు.ప్రస్తుతం 'ది రాజా సాబ్' చిత్రంలో ప్రభాస్ సరసన నటిస్తున్న నిధి అగర్వాల్, ఇలాంటి సున్నితమైన అంశంపై ధైర్యంగా స్పందించడాన్ని పలువురు ప్రశంసిస్తున్నారు. మరి నిధి కౌంటర్‌కు శివాజీ మళ్ళీ ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.