క్రిస్మస్ జాతకం.. 12 రాశుల వారి ఫలితాలు ఇవే..!

క్రిస్మస్ జాతకం.. 12 రాశుల వారి ఫలితాలు ఇవే..!

యేసుక్రీస్తు జన్మదినాన్ని పురస్కరించుకుని ప్రపంచవ్యాప్తంగా ఘనంగా జరుపుకునే విశిష్టమైన పండుగ క్రిస్మస్​.  ఈ పండుగను ప్రతి సంవత్సరం డిసెంబర్​ 25 వ తేదీన జరుపుకుంటారు. ప్రజలు తమ కుటుంబం, స్నేహితులతో సమయాన్ని గడిపే, జ్ఞాపకాలను చేసుకునే సమయం ఇది. క్రిస్టియన్​ ఫాదర్స్​ తెలిపిన వివరాల ప్రకారం 12 రాశుల వారికి ఎలా ఉంటుందో క్రిస్మస్​ జాతకాన్ని తెలుసుకుందాం. . .!

మేష రాశి: ఈ రాశి వారికి  మనస్సులో ఒకేసారి అనేక విషయాలు మెదులుతాయి.  ఇది పరధ్యానానికి దారితీస్తుంది. పనిలో తొందరపడటం వల్ల హాని కలుగుతుంది.  ప్రతిదీ ఆలోచనాత్మకంగా చేయండి. డబ్బు పరంగా రిస్క్ తీసుకోవద్దని చెబుతున్నారు క్రిస్టియన్​ ఫాదర్స్​. ఆరోగ్య విషయంలో  ఎలాంటి ఇబ్బందులు ఉండవు.  

వృషభం: వృత్తి, వ్యాపారాల్లో బాగా కలిసి వస్తుంది. ఆర్థికంగా బాగా పురోగతి చెందుతారు. రోజువారీ పనులు సౌకర్యవంతంగా నిర్వహిస్తారు. కుటుంబ సభ్యులతో మాట్లాడటం వల్ల మనస్సు బాగుంటుంది. అవసరానికి తగ్గట్టుగా ఖర్చు పెట్టండి.   ఆరోగ్యం బాగుంటుంది, సోమరితనం ఆధిపత్యం లాయించనివ్వవద్దు.  మీరు రిలాక్స్‌గా ఉంటారు.

మిథునం: ఏ పని చేపట్టినా కలిసి వస్తుంది. ముఖ్యంగా అదనపు ఆదాయ ప్రయత్నాలు బాగా సక్సెస్ అవుతాయి. సంభాషణలో జాగ్రత్త అవసరం. మీ పాయింట్‌ను తప్పుగా అర్థం చేసుకోవచ్చు. ఆఫీసు పని బిజీగా ఉంటుంది. ఫోన్ లేదా టెక్స్ట్ ద్వారా వాదనలకు దూరంగా ఉండండి. పాత పనిని పూర్తి చేసే అవకాశాన్ని పొందవచ్చు.  మనస్సు ప్రశాంతంగా ఉంటుంది.

కర్కాటకం: ఉద్యోగ జీవితం సాఫీగా సాగిపోతుంది. వృత్తి, వ్యాపారాలు ప్రోత్సాహకరంగా ఉంటాయి. . కుటుంబానికి సంబంధించిన ఏ అంశం అయినా మనసులో ఉంటుంది. మీ కృషి పనిలో స్పష్టంగా కనిపిస్తుంది.  ప్రశంసలు కొంచెం ఆలస్యంగా వస్తాయి. నమ్మకమైన వ్యక్తితో మాట్లాడటం మనస్సుకి సంతోషాన్ని ఇస్తుంది.

ALSO READ : Christmas Special: యేసు .. లోక రక్షకుడు.. క్రిస్మస్ ప్రాధాన్యత ఇదే..!

సింహరాశి: వృత్తి, ఉద్యోగాల్లో ప్రాభవం, ప్రాధాన్యం బాగా పెరుగుతాయి. వ్యాపారాల్లో అంచనాలకు మించి లాభాలు వస్తాయి. ఎలాంటి ఆటంకాలు లేకుండా అనుకున్న పనులు సజావుగా సాగుతాయికోపంతో ఎలాంటి నిర్ణయం తీసుకోవడం మానుకోండి. అంతా ఎంజాయి చేస్తూ ఆనందంగా గడుపుతారు.  ఆర్దికంగా ఎలాంటి ఇబ్బందులు ఉండవు. 

కన్య: ఆర్థిక పరిస్థితి మునుపటి కంటే బలంగా మారుతుంది. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. పూర్తి కాని పనులు ముందుకు సాగుతాయి.   డబ్బుకు సంబంధించిన ప్రయోజనాలు కలుగుతాయి.  ఆరోగ్యం సాధారణంగా ఉంటుంది.  మొత్తం మీద  సంతృప్తికరంగా ఉంటుంది.

తుల: వృత్తి, ఉద్యోగాల్లో ఆర్థికంగా బాగా పురోగతి చెందుతారు. ముఖ్యమైన ఆస్తి, ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఆధ్యాత్మికంగా చాలా ముఖ్యమైన రోజు. పని చేసేటప్పుడు ఏకాగ్రత అవసరం.  ఆర్థిక పరిస్థితి కూడా బాగుంటుంది. చట్టపరమైన సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారు శుభవార్తలను వింటారు. వ్యాపారస్తులకు కూడా ఇది శుభ సమయం. ఆరోగ్యం పట్ల కూడా శ్రద్ధ వహించాలి

వృశ్చికం: ఆర్థికాభివృద్ధికి సంబంధించిన విషయాలన్నీ విజయవంతంగా కొనసాగుతాయి.ఈ సమయంలో అనేక లాభాలను పొందుతారు. ఉద్యోగులకు కూడా ఇది మంచి సమయం. కొత్త ఉద్యోగ ఆఫర్లు రావచ్చు. వ్యాపారులకు కూడా ఇది అద్భుతమైన సమయం. ప్రేమ జీవితంలో కాస్త సమస్యలు ఉండొచ్చు. ఆర్థిక ఇబ్బందులు క్రమంగా తొలగిపోతాయి.

 ధనుస్సు: వృత్తి, ఉద్యోగాల్లో సహోద్యోగుల కంటే ఒక అడుగు ముందుంటారు. వ్యాపారాల్లో లాభాలకు లోటు ఉండదు.  ఉద్యోగస్తులు ప్రశంశలు అందుకుంటారు. సమాజంలో గౌరవం .. కీర్తి.. ప్రతిష్టలు పెరుగుతాయి. కార్యాలయంలో సహోద్యోగుల మద్దతు లభిస్తుంది. ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందులు ఉండవు. వ్యాపారస్తులు ఆనందంగా గడుపుతారు. మనసులోని కోరికలు చాలావరకు నెరవేరుతాయి. 

మకరం: ఉద్యోగంలో ప్రాధాన్యం పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాలు బిజీగా సాగిపోతాయి.కొత్త ప్రాజెక్ట్​ ను చేపట్టే అవకాశం ఉంది. వ్యాపారస్తులకు అనుకోని లాభాలు కలుగుతాయి.  ఉద్యోగస్తులకు ఆదాయం పెరిగే అవకాశం ఉంది. కొత్త పరిచయాలు ఏర్పడుతాయి.ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. కొత్తగా ప్రేమ చిగురించే అవకాశం ఉంది.

కుంభం: ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. సేవింగ్ అలవాటు మొదలవుతుంది.  ఉద్యోగస్తులు ప్రశంశలు అందుకుంటారు. సమాజంలో గౌరవం .. కీర్తి.. ప్రతిష్టలు పెరుగుతాయి. కార్యాలయంలో సహోద్యోగుల మద్దతు లభిస్తుంది. ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందులు ఉండవు. వ్యాపారస్తులు ఆనందంగా గడుపుతారు. మనసులోని కోరికలు చాలావరకు నెరవేరుతాయి. 

మీనం: విశ్రాంతి తీసుకోవడానికి సమయం కేటాయించాలి. చదవడం లేదా కళ వంటి మిమ్మల్ని సంతృప్తిపరిచే కార్యకలాపాలు చేయాలి. కొత్త ప్రాజెక్ట్​ ను చేపట్టే అవకాశం ఉంది. వ్యాపారస్తులకు అనుకోని లాభాలు కలుగుతాయి.  ఉద్యోగస్తులకు ఆదాయం పెరిగే అవకాశం ఉంది. కొత్త పరిచయాలు ఏర్పడుతాయి.

Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనాన్ని జ్యోతిష్య నిపుణుల సలహాలతో పాటు ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించలేదు. మీకున్న వాస్తు, జ్యోతిష్య సమస్యలకు నిపుణులను సంప్రదించటం ఉత్తమం.