Christmas Special: యేసు .. లోక రక్షకుడు.. క్రిస్మస్ ప్రాధాన్యత ఇదే..!

Christmas Special:   యేసు .. లోక రక్షకుడు.. క్రిస్మస్ ప్రాధాన్యత ఇదే..!

క్రైస్తవులకు ముఖ్యమైన పండుగ క్రిస్మస్. యేసు క్రీస్తు పుట్టిన రోజును క్రైస్తవులు పండుగ చేసుకుంటారు. ఏసు క్రీస్తు జన్మదిన సందర్భంగా జరుపుకునే ఈ పండుగ ఎంతో పవిత్రమైనది. యేసు జన్మించి ఇప్పటికి రెండు వేల సంవత్సరాలు దాటిపోయినా ఆయనను కరుణారస మూర్తిగా, దయామూర్తిగా భావించి నిత్యం ప్రార్థనలు చేస్తున్నారు భక్త జనులు.

 క్రైస్తవులు తెలిపిన వివరాల ప్రకారం..  యేసుక్రీస్తు జన్మించినప్పుడు భూమి .... దురాశ, మూఢనమ్మకాలు  కపటత్వం  అనేవాటితో బాధపడుతుంది.  ప్రపంచంలోని నివసించే వారు అలాంటి చెడులను అధిగమించడానికి దైవత్వ స్వరూపంగా ఆయన అవతరించాడని చెబుతున్నారు.

ALSO READ : క్రిస్మస్ జాతకం.. 12 రాశుల వారి ఫలితాలు ఇవే..!

ప్రపంచవ్యాప్తంగా క్రిస్టియన్​ సోదరులు ఘనంగా  క్రిస్మస్ సంబరాలు  జరుపుకుంటారు .  ప్రజలు తమ ఇళ్లలో క్రిస్మస్ చెట్లను అలంకరిస్తారు.  ప్రతి సంవత్సరం క్రిస్మస్​ పర్వదినాన డిసెంబర్​ 25న  చర్చిలలో క్రిస్మస్ వేడుకలలో అర్ధరాత్రి ప్రార్థనలు జరుపుతారు. యేసు అర్ధరాత్రి జన్మించాడని ..  క్రిస్మస్ ముందు రోజు  సాయంత్రం ( డిసెంబర్​ 24) క్రిస్టియన్స్​ బహుమతులు పంచుకుంటారు.  క్రిస్మస్ సంప్రదాయానికి చాలా ప్రాముఖ్యత ఉంది. క్రిస్మస్ చెట్టు క్రీస్తుకు చిహ్నమని చెబుతుంటారు. నక్షత్రం   క్రీస్తు  ఆత్మను సూచిస్తుంది. ప్రజలు తమ ఇళ్లఎదుట  లైటింగ్​ తో కూడిన నక్షత్రాన్ని  అలంకరిస్తారు

క్రిస్టియన్​ గ్రంధాల ప్రకారం..   ప్రభువు సిలువ వేయబడిన కాలానికి ముందు క్రీస్తుపూర్వం 5 ..  7 మధ్య ఎక్కడైనా యేసు జన్మించి ఉంటాడని నిర్ధారించారు. కొంతమంది జ్యోతిష్కులు యేసు క్రీస్తుపూర్వం 7వ సంవత్సరంలో, అంటే బెత్లెహెం (ప్రస్తుత ఇజ్రాయెల్)లో తెల్లవారుజామున 1:21 గంటలకు జన్మించాడని పేర్కొన్నారు.

బైబిల్​ ప్రకారం  డిసెంబర్​ 25 వ తేది యేసు క్రీస్తు జన్మించాడు.  శీతాకాలపు అయనాంతంలో సూర్యుడు తిరిగి వచ్చే తేదీతో సమానంగా ఉంటుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. పంచాంగం ప్రకారం  శనిని పాలించే సూర్యు గ్రహం అయిన మకర రాశిలోకి ప్రవేశించడాన్ని ఈ అయనాంతం  సూచిస్తుంది. ఆ రోజున ( డిసెంబర్​ 25) , సూర్యుడు మకర రాశిపై ఆగి...  ఉత్తరం వైపు తన ప్రయాణాన్ని తిరిగి  ప్రారంభిస్తాడు. పండితులు జాతకాన్ని పరిశీలించేటప్పుడు సూర్యుడి గమనాన్ని ఆధారంగా  లెక్కిస్తారు. 

యేసే.. సూర్యుడు

యేసును సూర్యునితో అనుసంధానించే వివిధ అంశాలు ఉన్నాయని తెలుస్తుంది. క్రిస్టియన్​ ప్రచారకుడు  సెయింట్ అగస్టీన్ తెలిపిన వివరా ప్రకారం .. , యేసు పుట్టిన రోజు నుంచి కాంతి పెరగడం ప్రారంభమవుతుంది. అందువలన  ప్రభువైన యేసును ... యోహాను అనే  లోకానికి వెలుగు అని పిలిచాడు.  మార్చి 28న యేసు  తన తల్లి గర్భంలో ఏర్పడ్డాడు.  ఆదికాండములో..  సూర్యుని సృష్టి దినం. ఈ కారణంగా, మలాకీ ప్రవక్త ఆయనను నీతి సూర్యుడిగా అభివర్ణించాడు.