ఛత్తీస్‌గఢ్‌లో ఘోర ప్రమాదం.. పికప్ వాహనం బోల్తా పడి 17మంది మృతి

ఛత్తీస్‌గఢ్‌లో ఘోర ప్రమాదం.. పికప్ వాహనం బోల్తా పడి 17మంది మృతి

న్యూఢిల్లీ: ఛత్తీస్‌గఢ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.  రాష్ట్రంలోని కబీర్‌ధామ్ జిల్లా కవార్ధా పట్టణం సమీపంలో ఓ  పికప్ ట్రక్కు బోల్తా పడిన ఘటనలో 17 మంది మృతి చెందగా.. 6 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను చికిత్స కోసం సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. 

ఈ ఘటనపై కవార్ధా పోలీసు సూపరింటెండెంట్(SP) అభిషేక్ పల్లవ్ మాట్లాడుతూ..  మే 20వ తేదీ సోమవారం ఉదయం కవార్ధా పట్టణం సమీపంలోని బహపానీ ప్రాంతంలో చోటుచేసుకుంది. ఈ ప్రమాదం జరిగినట్లు తెలిపారు. వాహనాన్ని అతివేగంగా నడపడం వల్ల అదుపు తప్పి బోల్తా పడి ఉండవచ్చని ప్రాథమిక విచారణలో తేలిందన్నారు. ఈ ఘటనకు కచ్చితమైన కారణాన్ని గుర్తించేందుకు అధికారులు సమగ్ర దర్యాప్తు చేస్తున్నారని చెప్పారు. స్థానిక పోలీసు అధికారులు, రెస్క్యూ బృందాలు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయన్నారు.  మృతదేహాలను వెలికితీశారని... క్షతగాత్రులను అత్యవసర వైద్యం కోసం సమీపంలోని ఆసుపత్రులకు తరలించాయని తెలిపారు.

ఈ ఘటనపై డిప్యూటీ సీఎం విజయ్ శర్మ తన ఎక్స్ పోస్ట్‌లో స్పందిస్తూ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు., “కవర్ధాలో కార్మికులతో వెళ్తున్న పికప్ వాహనం బోల్తా పడి 17 మంది మరణించారనే వార్త చాలా బాధాకరమైనదన్నారు.  ఈ ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానన్నారు.  గాయపడిన వారందరూ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నానని తెలిపారు. వారికి మెరుగై వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు.  రాష్ట్ర ప్రభుత్వ పర్యవేక్షణలో స్థానిక అధికారులు బాధితులకు, వారి కుటుంబాలకు అన్ని విధాలుగా అండగా ఉంటుందని ఆయన చెప్పారు.