Directors Day 2024: ఘనంగా జరిగిన డైరెక్టర్స్ డే వేడుకలు.. ఈ దర్శకులు ఎక్కడా అంటున్న నెటిజన్స్

Directors Day 2024: ఘనంగా జరిగిన డైరెక్టర్స్ డే వేడుకలు.. ఈ దర్శకులు ఎక్కడా అంటున్న నెటిజన్స్

తెలుగు చలనచిత్ర పరిశ్రమకు చెందిన కొంతమంది దర్శకులు చాలా రోజులుగా దర్శకరత్న దాసరి నారాయణరావు(Dasari Narayana Rao) పుట్టినరోజు సందర్బంగా డైరెక్టర్స్ డేని గ్రాండ్గా సెలబ్రేట్ చేయాలని నిర్ణయించుకున్న విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించిన వేడుకను ఆదివారం మే 19న ఘనంగా జరిపారు. ఈ వేడుక‌కు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా హాజ‌రు కాగా, సీనియ‌ర్ న‌టుడు ముర‌ళి మోహ‌న్ తో పాటు  యంగ్ హీరోస్ నేచుర‌ల్ స్టార్ నాని, సుధీర్ బాబు, కార్తికేయ వంటి స్టార్లు హాజరయ్యారు. 

అసలు విషయానికి వస్తే..దర్శకరత్న పుట్టినరోజును ప్రతి ఏటా టాలీవుడ్ ప్రముఖులు ఘనంగా నిర్వహిస్తూ వస్తున్నారు. అయితే ఈ ఏడాది ఇంకా ఘనంగా నిర్వహించాలని కొంతమంది దర్శకులు ఫిక్స్ అయ్యారు. ఈ మేరకు మెగాస్టార్ చిరు, వెంకటేష్, ప్రభాస్ వంటి స్టార్ నటులకు ఆహ్వానం కూడా అందించారు. దీంతో సినీ ప్రేక్షకులు ఈ వేడుకకు సంబంధించి చాలా ఊహించుకున్నారు. ఎందుకంటే,  

ఈ వేడుక‌కు ద‌ర్శ‌క‌ధీరుడు ఎస్.ఎస్.రాజ‌మౌళి,త్రివిక్ర‌మ్,సుకుమార్,బోయ‌పాటి శ్రీ‌ను స‌హా ప‌లువురు దిగ్గ‌జ ద‌ర్శ‌కులు హాజరవుతారని  అందరూ భావించారు. అలాగే సినీ ప‌రిశ్ర‌మకు చెందిన అగ్ర హీరోలు చిరంజీవి,మ‌హేష్‌,ప్ర‌భాస్,చ‌ర‌ణ్ వంటి స్టార్లు కూడా  అటెండ‌వుతార‌ని ఎంతో ఆశించారు. కానీ ఈసారి ఈవెంట్ కి ఆశించినంత మంది సినీపెద్ద‌లు వ‌చ్చిన‌ట్టు ఎక్కడా క‌నిపించ‌లేదు.ముఖ్యంగా ఇలాంటి ప్రతిష్టాత్మకమైన వేడుక‌కు పాన్ వరల్డ్ లో సినిమాలు తీసే రాజ‌మౌళి,పాన్ ఇండియాలో సినిమాలు తీసే త్రివిక్ర‌మ్- సుకుమార్ వంటి ద‌ర్శ‌కులు రాకపోవడంతో కళ త‌ప్పింద‌ని సినీ అభిమానులు భావిస్తున్నారు.

ఇక ప‌రిశ్ర‌మ పెద్ద ప్ర‌సాద్ లాబ్స్ ర‌మేష్ ప్ర‌సాద్, ద‌ర్శ‌కుడు వీర‌శంక‌ర్ త‌దిత‌రులు హాజ‌ర‌య్యారు. అయితే,ఈ వేడుక‌లో అనీల్ రావిపూడి పేర‌డీ స్కిట్ లు ఆడియన్స్ ను అల‌రించాయి. ఈ కార్యక్రమంలో..హరీష్ శంకర్, విప్లవ సినిమాలు తీసే ఎన్ శంకర్, మెహర్ రమేష్,వంశీ పైడిపల్లి, తమ్మారెడ్డి భరద్వాజ, వెల్దండి వేణు,చంద్రమహేష్,ఎస్వీ కృష్ణారెడ్డి,అచ్చిరెడ్డి,మారుతి,బుచ్చిబాబు వంటి తదితరులు పాల్గొన్నారు.

అల్లు అర్జున్ మాట్లాడుతూ..'దర్శక రత్న దాసరి నారాయణరావు గారి జయంతి సందర్భంగా దర్శక దినోత్సవం జరుపుకుంటున్నట్లు తెలిసి నాకు ఎంతో సంతోషం కలిగిందని అల్లు అర్జున్ తెలిపారు. ఈరోజు తెలుగు సినిమా ఖ్యాతి ప్రపంచ స్థాయికి చేరింది. ప్రపంచమంతా ఇప్పుడు తెలుగు సినిమాల వైపు ఎంతో ఆసక్తిగా చూస్తోంది.ఈ వేడుక‌ను ద‌ర్శ‌కులు ముందుండి ఎలాంటి లాభాపేక్ష లేకుండా నిర్వ‌హించారంటూ' వేదిక‌పై అల్లు అర్జున్ ప్ర‌శంసించ‌డం గ‌మ‌నార్హం.

ఈ కార్యక్రమంలో అల్లు అర్జున్‌కు దర్శకుల సంఘం తరఫున ఘనంగా సన్మానం చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోస్, వీడియోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.