Sneha: నరకం అనుభవించా.. మళ్ళీ సినిమాల్లోకి వస్తాననుకోలేదు.. స్నేహ ఎమోషనల్!

Sneha: నరకం అనుభవించా.. మళ్ళీ సినిమాల్లోకి వస్తాననుకోలేదు.. స్నేహ ఎమోషనల్!

ఒకప్పుడు సౌత్ సినీ ఇండస్ట్రీలో తనదైన ముద్ర వేసిన హీరోయిన్ స్నేహ. షార్ట్ టైంలోనే తన నటన, అభినంయతో ఎన్నో సూపర్ హిట్ సినిమాలతో మెప్పించింది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో స్టార్ హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకుంది. గ్లామర్ షోకు దూరంగా పద్దతిగా కనిపిస్తూనే ఫ్యామిలీ ప్రేక్షకులకు దగ్గరైంది ఈ అమ్మడు. కెరీర్ మంచి ఫాంలో ఉండగానే తమిళ హీరో ప్రసన్నతో ప్రేమలో పడిన స్నేహ.. 2012లో రెండు కుటుంబాల సమక్షంలో పెండ్లి చేసుకున్నా రు. వీరికి బాబు, పాప ఉన్నారు. లేటెస్ట్ గా ఒక ఇంటర్యూలో తన కెరీర్ పై ఆసక్తికరమైన విషయాలు పంచుకుంది స్నేహ.
 
మానసిక వేదనతో.. 

అయితే మ్యారేజీ తర్వాత సినిమాలకు దూరంగా ఉన్న ఆమె.. ఆ తర్వాత రీఎంట్రీ ఇచ్చింది. ఇప్పుడు మరోసారి మూవీలకు గ్యాస్ ఇవ్వడం వెనుక ఒక చేదు జ్ఞాపకం దాగి ఉందని తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది స్నేహ. 'నా కెరీర్ లో వరుస సినిమాలతో బిజీగా ఉన్న టైంలో ఒక ఘోర ప్రమాదానికి గురైనట్లు తెలిపింది.. నా కాళ్లు, చేతులు, వీపు భాగాలకు తీవ్ర గాయాలయ్యాయి. కనీసం లేచి నిలబడాలన్నా 8 నెలలకు పైగా సమయం పడుతుందని డాక్టర్లు తేల్చి చెప్పడంతో తీవ్ర మానసిక ఆ వేదనకు లోనయ్యానంటూ చెప్పుకొచ్చింది. నిజంగా చెప్పాలంటే ఆరోజుల్లో పెద్ద నరకం అనుభవించానని ఆవేదన వ్యక్తం చేసింది స్నేహ.

►ALSO READ | VijayRashmika: 'విరోష్' రిసెప్షన్‌కు క్యూఆర్ కోడ్ ఉంటేనే ఎంట్రీ.. రూల్స్ అతిక్రమిస్తే నో ఛాన్స్!

కదల్లేని స్థితిలో రీఎంట్రీ!

ఇక ఇంతటితో నా కెరీర్ ముగిసిపోయిందని అనుకున్న. కానీ డైరెక్టర్ కరు పళనియప్పన్ 'పార్థిబన్ కనవు' కథతో తనను సం ప్రదించించినట్లు తెలిపింది స్నేహ.. అసలు కదల్లేని స్థితిలో ఉన్న అని తెలిసి కూడా చిత్రం కోసం పిలవడం చూసి షాకయ్యానని చెప్పింది. కానీ ఆ దర్శకుడు ఇచ్చిన ధైర్యం, చూపించిన నమ్మకమే మళ్లీ నన్ను కోలుకునేలా చేసింది' అంటూ స్నేహ ఎమోషనల్ అయ్యింది.  ప్రస్తుతం ఓ వైపు ఫ్యామిలీ లైఫ్ చూసుకుంటూనే.. మరో వైప్ క్యారెక్టర్ ఆర్టిస్టుగా అడపాదడపా సినిమాలు చేస్తుంది.  లేటెస్ట్ ఆమె నటించిన ఫాంటసీ కామెడీ చిత్రం 'మూకుతి అమ్మన్ 2' త్వరలో విడుదల కానుంది.